బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరు పొందిన హీరోయిన్ ప్రియాంక చోప్రా. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక బాలీవుడ్ ని తన అందాలతో హీటెక్కిస్తూ ఉంటుంది. బాలీవుడ్ లో హాట్ వెబ్ సిరీస్ లో కూడా నటించి గ్లోబల్ స్టార్ గా మారిపోయింది. ఇక అమెరికన్ సింగర్ డిస్నీ స్టార్ నిక్ జోనాస్ ను ప్రేమించి వివాహం చేసుకున్నది. వీరిద్దరూ తమ సోషల్ మీడియాలో అకౌంట్ లో ఉన్న పేరు నుండి “చోప్రా జోనాస్” ని తొలగించడం జరిగింది.
పెళ్లయిన మూడు సంవత్సరాలకి తన భర్తతో విడాకులు తీసుకోబోతున్నట్లు అనే వార్తలు సోషల్ మీడియాలో ఊహాగానాలు గా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని మాత్రం బోగస్ అని ప్రియాంక స్నేహితుడు ధృవీకరించారు. నవంబర్ 22 వ తేదీన ప్రియాంక చోప్రా, జోనాస్ తన ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ నుండి చోప్రా జొనాస్ తొలగించాడు. దీంతో విడాకులు తీసుకోబోతున్నారు అనే వార్త రాగానే ప్రియాంక చోప్రా స్నేహితుడు నిక్ జోనాస్ ఇవన్నీ కేవలం వట్టి పుకార్లే అని తెలియజేశాడు. ప్రియాంక కూడా తన పేరు నుండి చోప్రా ని తొలగించిందని, మరియు ఆమె తన మొదటి పేరు తోనే పిలవ బడాలని కోరుకుంటుందని అతను వెల్లడించారు