బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కి కొద్దీ రోజుల క్రితం తన విదేశీ ప్రియుడు నిక్ జోనాస్ తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుండి వీరిద్దరూ ఎక్కడికి వెళ్లిన పత్రిక విలేకరులు, మీడియా వారు వీరిని చుట్టూ ముడుతూనే ఉన్నారు. తాజాగా ప్రియాంక, నిక్ అమెరికా లోని కాలిఫోర్నియాలో సరదాగా సమయం గడుపుతున్నారు. అందులో భాగంగా నిన్న సోమవారం నిక్ 26వ బర్త్‌డే సందర్భంగా జరిగిన ఒక ఈవెంట్ లో తమ ఫ్రెండ్స్ సమక్షంలో ఇలా వీరిద్దరూ పబ్లిక్ లోనే కిస్ పెట్టుకుని తమ ప్రేమని చాటుకున్నారు. తర్వాత నిక్ కి ప్రియాంక కేక్ తినిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్ లో హాల్ చల్ చేస్తుంది.
ప్రియాంక మరో ఫోటో లో నిక్ కాళ్ళ పై కూర్చుని ఫోజ్ ఇవ్వటం జరిగింది, వీరు తమ స్నేహితులతో కలిసి అమెరికా లో ఉన్న ఒక ప్రముఖ ఫార్మ్ లో ఈ ఫోటో తీసుకున్నారు.