ప్రియాంక,నిక్ విడాకుల పై స్పందించిన ప్రియాంక తల్లి..?

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ ల జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈ జంటపై సోషల్ మీడియాలో ఒక వార్త పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఈ దంపతులు విడాకులు తీసుకోబోతున్నారా? అన్న ప్రశ్నకు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇందుకు గల కారణాలు కూడా లేకపోలేదు. తాజాగా ప్రియాంక ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ లలో తన ప్రొఫైల్ పేరు నుంచి. జోనస్ ఇంటిపేరు తీసేసింది.

దీనితో ఈ జంట టాలీవుడ్ సమంత నాగచైతన్య బాటలో నడుస్తుంది, వీరు కూడా త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారు అంటూ జోరుగా ప్రచారాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రియాంక తల్లి మధు చోప్రా ఈ వార్తలపై స్పందించింది. తాజాగా ఆమె ఒక న్యూస్ పోర్టల్ ఇంటర్వ్యూ ఇస్తూ.. ప్రియాంక, నిక్ విడాకుల విషయం పై వస్తున్న రూమర్లను ఖండించింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని, అవన్నీ కూడా వట్టి పుకార్లేనని ఆమె స్పష్టం చేసింది. అలాగే ఇలాంటి అసత్య ప్రచారాలను వైరల్ చేయవద్దు అంటూ ఆమె నెటిజన్లను కోరింది.

Share.