మళయాళ భామ ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన ఒరు ఆధార్ లవ్ సినిమా తెలుగులో డబ్ అవుతుంది. తెలుగులో లవర్స్ డే గా వస్తున్న ఈ సినిమాలో రోషన్ అబ్ధుల్, ప్రియా ప్రకాశ్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఒమర్ లులు డైరెక్ట్ చేసిన ఈ సినిమా టీజర్ సెన్సేషన్ అయ్యింది. వింక్ బ్యూటీగా ప్రియా ప్రకాశ్ చేసిన కనుసైగలకు అంతర్జాలం అతలాకుతలం అయ్యింది అంటే అమ్మడి మాయాజాలం ఎంత పనిచేసిందో తెలుస్తుంది. ఇక ఈ సినిమా తెలుగు ఆడియోకి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా అటేండ్ అయ్యారు.
ఈ వేడుకలో బన్ని మాటలకు ఫ్యాన్స్ ఉప్పొంగిపోయారు. ఇదిలాఉంటే ప్రియా ప్రకాశ్ తన మెడ కింద వేసుకున్న టాటూ మీద డిస్కషన్స్ మొదలయ్యాయి. Carper Diem అంటూ టాటూ వేయించుకున్న ప్రియా ప్రకాశ్ ఆ పదాన్ని గూగుల్ లో వెతికితే అదో లాటిన్ పదానికి షార్ట్ ఫాం అని తెలుస్తుంది. Carpe diem quam minimum credula postero అంటే తెలుగులో భవిష్యత్ పై ఆశలతో నేడు జీవించండి అని అర్ధమట. ఆ టాటూ అర్ధం తెలిసిన తర్వాత ప్రియా ప్రకాశ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అని కామెంట్స్ వస్తున్నాయి.
ఏది ఏమైనా ఓ చిన్న టీజర్ తో సంచలనం సృష్టించిన ప్రియా ప్రకాశ్ ఈ జోష్ చూస్తుంటే త్వరలోనే తెలుగులో సినిమా చేసేలా ఉంది. బన్ని సపోర్ట్ ఎలాగు ఉంది కాబట్టి ప్రియా తెలుగులో వరుస ఆఫర్స్ కొట్టేసినట్టే. లవర్స్ డే సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతుంది.