సన్ని లియోన్ ను వెనక్కి నెట్టేసిన ప్రియా ప్రకాశ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

పోర్న్ స్టార్ నుండి బాలీవుడ్ హాట్ స్టార్ గా టర్న్ తీసుకున్న సన్ని లియోన్ జిస్మ్-2 నుండి వేరే బాలీవుడ్ ఏ తారకు రాని క్రేజ్ పాపులారిటీ తెచ్చుకుంది. ఓ పక్క ఆమె పోర్న్ వీడియోస్ తో పాటుగా సినిమాల్లో ఆమె ఇంటిమేట్ సీన్స్ బాగా హల్ చల్ చేశాయి. అందుకే 2016, 2017 లలో గూగుల్ లో మోస్ట్ సెర్చ్ హీరోయిన్ గా టాప్ ప్లేస్ లో నిలిచింది. ఇక 2018 సీన్ మారింది. టాప్ ప్లేస్ కాదు కదా కనీసం టాప్ 10 లో కూడ సన్ని లియోన్ లేకుండా పోయింది. ఆమె స్థానంలో ఈ ఇయర్ టాప్ 1గా నిలిచింది. మళయాల భామ ప్రియా ప్రకాశ్ వారియర్.

ఒరు ఆధార్ లవ్ సినిమా టీజర్ తో ఆమె కన్నుగీసిన ఎక్స్ ప్రెషన్ ఒక్కసారిగా ఆమె క్రేజ్ పెంచేలా చేసింది. రిషి కపూర్, అల్లు అర్జున్ లాంటి వారు సైతం ఆమెను ఫాలో అయ్యారంటే అమ్మడి ఏ రేంజ్ కు వెళ్లిందో తెలిసిందే. ఒక్కదెబ్బతో ఓవర్నైట్ స్టార్ అయిన ప్రియా ప్రకాశ్ వారియర్ ఆమె వెంట 2 మిలియన్ ఫాలోవర్స్ వచ్చేలా చేసుకుంది. ఇక ఆమె గురించి నెట్ లో వెతకడం మొదలుపెట్టారు. గూగుల్ లో 2018లో బాగా వెతికిన సెలబ్రిటీస్ లో ప్రియా ప్రకాశ్ వారియర్ మొదటి స్థానంలో ఉంది.

ఆమెకు ఇంత క్రేజ్ తెచ్చిన సినిమా ఇంకా రిలీజ్ అవలేదు. అయినా సరే ప్రియాకు తెలుగు, తమిళ భాషల్లో సినిమా అవకాశాలు వస్తున్నాయి. అయితే అమ్మడు మాత్రం స్టార్ సినిమాల్లోనే నటిస్తా అని వచ్చిన అవకాశాలను వద్దని చెబుతుంది. గూగుల్ లో టాప్ స్థానంలో ఉన్న ప్రియా క్రేజ్ చూసి మిగతా హీరోయిన్స్ షాక్ అవుతున్నారు. మరి అమ్మడు కోరుకునే ఛాన్సులు వస్తాయో లేదో తెలియదు కాని మరోసారి గూగుల్ టాప్ 1 గా ప్రియా పేరు మారిమోగుతుంది.

Share.