టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు కమెడియన్ గా పేరు తెచ్చుకున్న నటుడు పృథ్వీరాజ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇప్పుడు చాలామంది కమెడియన్స్ రావటం వల్ల ఈయన రేంజ్ కాస్త తగ్గిందనే చెప్ప వచ్చు. పృధ్వీరాజ్ తిరుపతికి వెళ్ళినప్పుడు.. విఐపి విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి పలు విషయాలు తెలియజేశారు.
పవన్ కళ్యాణ్ కు కెసిఆర్ డబ్బు పంపించారంటూ పెద్ద ఎత్తున వస్తున్న వార్తలను పృథ్వీరాజ్ ఖండించారు. ఇది కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే అని కొట్టి పడేశారు పృథ్వీరాజ్. గతంలో కూడా నాకు రూ.200 కోట్లు ఇచ్చారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఆ డబ్బును లెక్క పెట్టుకోవడానికి సమయం సరిపోలేదు అంటూ ఆయన వెటకారంగా మాట్లాడారు. ఇవన్నీ చూస్తుంటే ఒక సామెత గుర్తుకొస్తోంది. నరం లేని నాలుక ఎన్ని విధాలుగా అయినా మాట్లాడుతుంది అంటే ఇదేనేమో అన్నట్లుగా తెలిపారు.
పవన్ కళ్యాణ్ ట్యాక్స్ కట్టడం కోసమే రూ .9 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అంత మంచి మనసున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ ఆయనని పొగిడారు. ఇక పవన్ కళ్యాణ్ కు పోటీగా ఆలీ రంగంలోకి దిగబోతున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి.. అయితే ఈ వార్తలపై కూడా స్పందిస్తూ గతంలో ఒకడు పవన్ కళ్యాణ్ తో పోటో దిగి .. పవన్ కళ్యాణ్ తనతో పోటో దిగారని చెప్పుకున్నట్లు ఉంది. మనం కూడా మన స్థాయిని చూసుకోవాలి కదా అంటూ తెలిపారు పృధ్విరాజ్. ఆలీ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ వ్యాఖ్యలపై ఆలీ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.