ఇటీవల సినీ ఇండస్ట్రీలో చాలామంది ప్రేమ పేరుతో మోసపోయిన విషయం తెలిసిందే.. ఇప్పుడు తాజాగా క్యాస్టింగ్ కౌచ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు తమ ఇబ్బందులను ధైర్యంగా చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే తమిళ బిగ్ బాస్ కంటెస్టెంట్ జూలీ అమింజికరై .. అన్నా నగర్ కు చెందిన మనీష్ గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. త్వరలో పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.. కానీ తనకు మాయమాటలు చెప్పి ఇంట్లో విలువైన వస్తువులు ,డబ్బు, నగలు తీసుకుని పారిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది జూలీ.
ఈ మేరకు గాలింపు చేపట్టిన పోలీసులు మనీష్ ను అదుపులోకి తీసుకున్నారు . మనీష్ కూడా జూలీ పై ఆరోపణలు చేశాడు.. జూలీ తనతో పెళ్లి చేసుకుంటానని చెప్పి మరొక వ్యక్తికి దగ్గరయింది అని అతను తెలిపాడు.. జూలీ తనతో సరిగ్గా మాట్లాడటం లేదని పోలీస్ ఎంక్వైరీ లో వెల్లడించాడు. దీంతో ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి కేసు క్లోజ్ చేశారని సమాచారం.