వేశ్య పాత్ర అందుకే చేశా…కేర్ అఫ్ కంచెరపాలెం నిర్మాత ప్రవీణ షాకింగ్ కామెంట్స్

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో వస్తున్న సరికొత్త సినిమాలు చూస్తుంటే తెలుగులో కూడా నూతన శకం మొదలైనట్టే అని తెలుస్తుంది. ఏళ్ల తరబడి తెలుగు సినిమా నాలుగు పాటలు, రెండు ఫైట్లు, హీరో హీరోయిన్ మధ్య రెండు రొమాంటిక్ సన్నివేశాలు..ఇక క్లైమాక్స్ లో విలన్ తో ఒక భారీ ఫైట్ అటు తర్వాత అందరు కలిసి పోవటం…దీని చుట్టూనే తిరుగుతుంది. ఆ మూస నుండి ఇప్పుడిప్పుడే మన తెలుగు సినిమా బయట పడుతుంది అని చెప్పటానికి చక్కటి ఉదాహరణ బాహుబలి, గూఢచారి, వేదం, శాతకర్ణి, కార్తికేయా, కృష్ణం వందే జగద్గురుమ్ వంటి సినిమాలు.

ఇక తాజాగా విడుదలైన కేర్ అఫ్ కంచెరపాలెం సినిమా కమెర్షియల్ సినిమాలకు ధీటుగా యూ ఎస్ ఏ లో కూడా వసూళ్లు సాధిస్తుంది. ఈ సినిమా కథ కంచెరపాలెం అనే పల్లెటూరిలో జరిగే నాలుగు ప్రేమ కథల చుట్టూ తిరుగుతుంది. ఇక ఇందులో సలీమా పాత్రలో చిత్ర నిర్మాత పరుచూరి ప్రవీణ నటించటం విశేషం. సలీమా అనే యువతీ ఈ సినిమాలో వేశ్య వృత్తి చేసుకుంటూ తన జీవనాన్ని సాగిస్తుంది. ఆమెని గెడ్డం అనే ఒక యువకుడు గాఢంగా ప్రేమిస్తాడు. సలీమా కూడా అతని ప్రేమని అంగీకరిస్తుంది.

అయితే తాజాగా ట్విట్టర్ లో ఒక అభిమాని ప్రవీణ ని అమెరికా లో డాక్టర్ అయినా మీరు ఒక చిన్న సినిమాలో వేశ్య పాత్ర లో ఎలా నటించారు అని అడగ్గా ఆమె ” సలీమా పాత్రని గెడ్డం కళ్లతో చూడండి, అతను చూపించే నిస్వార్థమైన ప్రేమకు ఆమె పూర్తిగా అర్హురాలు..అందుకే ఏ మాత్రం ఆలోచించకుండా ఆ పాత్రలో నటించాను. అంతే కాదు సలీమా స్వతంత్రంగా జీవించే మహిళా, తనకి సమాజం లో తగిన రక్షణ కూడా లేదు… అంతే తప్ప తన మనసులో ఎటువంటి క్రూరమైన ఆలోచనలు లేవు..సలీమా కి ప్రేమ కావాలి, తనకి జీవితం పై ఆశ ఉంది.. అని చాల తెలివిగా సమాధానం ఇచ్చారు ప్రవీణ.

 

Share.