పవర్ స్టార్ హీరోయిన్ ప్రణీత పై ఫైరైనా ఫ్యాన్స్

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ అందాల నటి ప్రణీత చూడటానికి చక్కగా చందమామ లాగా ఉంటుంది. అయితే ప్రణీతకి అనుకున్నంత క్రేజ్ కానీ స్టార్ డమ్ కానీ రాలేదు. తెలుగులో స్టార్ హీరోలు ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి వారితో నటించిన తగినన్ని అవకాశాలు మాత్రం దక్కలేదు. అయితే ప్రణీత మాత్రం పలు బ్రాండ్స్ మరియు కొన్ని వాణిజ్య సంస్థలకి ప్రచారకర్త గా వ్యవహరిస్తూ ఎప్పుడు బిజీ గా కనిపిస్తుంది. తాజాగా ప్రణీత బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా తో ఒక వీడియో సాంగ్ లో కూడా నటించింది.

ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ తో ఎప్పుడు టచ్ లో ఉండే ప్రణీత తాజాగా తన లేటెస్ట్ ఫోటో ఒకటి ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ ఫోటో లో ప్రణీత ఒక రెడ్ టాప్ లో హాట్ హాట్ గా దర్శనమిచ్చారు. సినిమాల్లో ఎక్కువగా పద్దతిగా కనిపించే ప్రణీత ఇలా ఒక్క సారిగా హాట్ డ్రెస్ లో కనిపించే సరికి ఆమె ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. కామెంట్స్ లో పలువురు అభిమానులు..మేడమ్ మీరు ఇటువంటి దుస్తులు ధరించకండని, మీరు పద్దతిగా ఉండే వస్త్రాల్లో ఫ్యామిలీ గర్ల్ గా ఉంటేనే బాగుంటారు..ఇటువంటి ఫోటో మీ నుండి అసలు ఊహించలేదు అని కామెంట్ చేయగా .. మరి కొంత మంది చాల హాట్ గా ఉన్నారు అని కామెంట్ చేయటం విశేషం. మరి కొంత మంది ఆమె పై ఫైర్ అయ్యారు

Share.