పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి ప్రణీత

Google+ Pinterest LinkedIn Tumblr +

స్టార్ హీరోయిన్ ప్రణీత ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ గా ఉన్నారు. ఆమె హిందీ లో హీరో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే ఒక ప్రముఖ బ్రాండ్ కి ప్రచారం లో భాగంగా హైదరాబాద్ వచ్చిన ప్రణీతని ఇక్కడి మీడియా వారు ఇంటర్వ్యూ చేయగా ఆమె పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. టాలీవుడ్ లో ప్రస్తుతం ఏమైనా సినిమాలో నటిస్తున్నారా అని ప్రశ్నించగా ఆమె దానికి సమాధానం ఇస్తూ ‘ ప్రస్తుతం హీరో రామ్ సినిమాలో నటిస్తున్న అని తెలిపారు, ఇక తెలుగులో మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరని ప్రశ్నించగా దానికి ప్రణీత పవన్ కళ్యాణ్ గారు అంటే చాల ఇష్టమని తెలిపారు. ప్రణీత ఇచ్చిన సమాధానం తో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి గా ఉన్నారని తెలుస్తుంది.

ఇంటర్వ్యూ లో భాగంగా నాకు శారీస్ కట్టుకోవటం అంటే చాల ఇష్టమని, ఎవరైనా శారీ కట్టుకుంటే చాల అందంగా కనిపిస్తారు. ఇక అభిమానులు సెల్ఫీ అడిగితే ఎలా స్పందిస్తారని అడగ్గా..బ్యాడ్ మూడ్ లో ఉన్నప్పటికీ నవ్వుతూనే సెల్ఫీ దిగుతానని సమాధానం ఇచ్చారు. గతంలో ప్రణీత పవన్ కళ్యాణ్ తో కలిసి అత్తారింటికి దారేది సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

Share.