మరో వివాదం లో ప్రకాష్ రాజ్

Google+ Pinterest LinkedIn Tumblr +

నిత్యం వివాదాలకు కేర్ అఫ్ అడ్రస్ గా ఉండే ప్రకాష్ రాజ్ మరో సారి వివాదం లో చిక్కుకున్నారు. మొన్న అనుపమ పరమేశ్వరన్ తో షూటింగ్ లో గొడవ పడ్డారని పత్రికల్లో వార్తలు హాల్ చల్ చేసాయి. ఇక తాజాగా ‘ హలో గురు ప్రేమ కోసమే ‘ సినిమా సెట్ లో సినిమాటోగ్రాఫర్ కే విజయ్ చక్రవర్తి తో గొడవ పడ్డారని సమాచారం. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ప్రకాష్ రాజ్ సినిమాటోగ్రాఫర్ విజయ్ ని ముందుగా క్లోజ్ అప్ షాట్ ని షూట్ చేయండని, ఆ తర్వాత డూప్ తో లాంగ్ షాట్ ని చిత్రీకరించండని చెప్పారట.

అయితే విజయ్ మాత్రం అది కుదరదని తాను ఆల్రెడీ లాంగ్ షాట్ ని తీయటానికి అంత సిద్ధం చేసుకున్నానని ఇప్పుడు మార్చటం కుదరదు అని చెప్పారట, విజయ్ సమాధానంతో ఆగ్రహించిన ప్రకాష్ రాజ్ అతనితో షూటింగ్ స్పాట్ లోనే గొడవ పడ్డారని ఇండస్ట్రీ లో టాక్.

నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తుండగా, త్రినాధ్ రావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్, అనుపమ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ నెలలో దసరా కానుకగా విడుదల కానుంది.

Share.