బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకొనే ఈమధ్య కాలంలో హాట్ టాపిక్ గా మారుతోంది. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ తో కలిసి నటిస్తున్న పఠాన్ చిత్రంలో బికినీ దుస్తులతో మరింత వైరల్ గా మారుతోంది. ఈ చిత్రం నుంచి రీసెంట్ గా ఒక పాట కూడా విడుదల అవడంతో ఆ వీడియో చాలా పాపులర్ అయింది. అయితే ఈ పాట పైన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సినిమాలో దీపిక ఆ డ్రెస్సులో ఉన్న సీన్లను తొలగించకపోతే తమ రాష్ట్రంలో ఈ చిత్రాన్ని ఆడనివ్వమంటూ వార్నింగ్ ఇస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రాన్ని బాయ్కాట్ చేస్తామంటూ ట్వీట్లు చేస్తూ ఉన్నారు.
మరి కొంతమంది అయితే షారుక్ ఖాన్ దిష్టిబొమ్మను కూడా దహనం చేస్తున్నారు. ప్రస్తుతం దీపిక డ్రెస్సు వివాదం బాగా ముదురుతోంది. అయితే నటుడు ప్రకాష్ రాజ్ బిజెపి విధానాలను విమర్శిస్తూ ఫైర్ అవుతూ ఉన్నారు. తాజాగా ప్రకాష్ రాజ్ పఠాన్ సాంగ్ వివాదం పైన స్పందించడం జరిగింది. బేషరం బిగొట్స్ కాషాయం ధరించి రేపిస్టులను సత్కరిస్తే వాళ్లను సపోర్ట్ చేస్తే ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తే పర్వాలేదు కానీ.. అలాగే బ్రోకర్ ఎమ్మెల్యేలు మరియు కాషాయ స్వామీజీలు మైనర్లపైన దారుణాలు చేస్తుంటే ఎవరు పట్టించుకోలేదు కానీ..
ఒక సినిమా సాంగ్ లో బోల్డ్ డ్రెస్ ధరించకూడదంటూ జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్విట్ చేశారు ప్రకాష్ రాజ్. ఇక ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ కాస్త వైరల్ గా మారుతోంది.దీంతో కొంతమంది ప్రకాష్ రాజును సపోర్ట్ చేస్తూ ఉంటే మరి కొంతమంది ప్రకాష్ రాజు పై కూడా ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ ఒకవైపు రాజకీయాలలో మరొకవైపు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. మరి దీపిక బికినీ విషయం ఎంత ధూరం వెళుతుందో చూడాలి.
Disgusting … How long should we tolerate these ..Colour Blind #AndhBhakts .. #justasking https://t.co/SSgxKpvcE9
— Prakash Raj (@prakashraaj) December 14, 2022