తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటిస్తూ ఉంటుంది. ఎక్కువగా హీరో హీరోయిన్లకు తల్లి క్యారెక్టర్లలో నటించి మెప్పించిన ప్రగతి అడపదడప సినిమాలలో నటిస్తూ ఉంటుంది. కరోనా మహమ్మారి తర్వాత ఇమే సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉండడమే కాకుండా తనకు సంబంధించిన విషయాలను తెలియజేస్తూ పలుజిమ్ వర్కౌట్లను చేస్తూ ఉండేటువంటి వీడియోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరింత పాపులారిటీ సంపాదించుకుంది.
ముఖ్యంగా తన ఫిట్నెస్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటుందో ఆమె వీడియోలను చూస్తే మనకి అర్థమవుతుంది. ఈ వయసులో కూడా కుర్ర హీరోయిన్లకు దీటుగా జిమ్ వర్కర్లు చేస్తూ చాలామంది నుంచి ప్రశంశాలు అందుకుంది. మరి కొంతమంది ఈమె పైన నెగటివ్ కామెంట్లు కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రగతి ఈ వయసులో కూడా ఎంతో చక్కగా డాన్సులు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ఇదంతా ఇలా ఉండగా ఇప్పటికే ప్రగతి రెండో పెళ్లిపై అనేక రకాలు వార్తలు వినిపించాయి.
తాజాగా ఈ వార్తల పైన ఘాటుగా స్పందించింది ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రగతికి మీకి రెండో పెళ్లి చేసుకోవాలనిపించిందా అనే ప్రశ్న వేయగా.. అందుకు ప్రగతి పెళ్లి అనడం కంటే దానిని కాంపానియన్ అంటే బెటర్ అని.. చాలాసార్లు నాకు కూడా కాంపానియన్ ఉంటే బాగుంటుందని అనిపించిందని తెలిపింది.కానీ నా మెచ్యూరిటీ లెవెల్ కి మ్యాచ్ అయ్యే వారు దొరకాలి కదా.. దొరికే వరకు సింగల్ గానే ఉంటానని తెలుపుతోంది. తనకంటూ కొన్ని విషయాలలో పర్టికులర్గా పలు కండిషన్స్ ఉన్నాయని అలాంటివారు దొరకాలి కదా అంటూ తెలియజేసింది. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.