తెలుగు సినీ ఇండస్ట్రీలో నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో కొన్ని చిత్రాలలో హీరోయిన్గా నటించిన ఈమె పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం మాడ్రన్ అమ్మ అత్త వంటి పాత్రలలో నటిస్తూ బిజీగా ఉంటోంది ప్రగతి. ముఖ్యంగా స్టార్ హీరోయిన్లకు తల్లి పాత్రలలో కూడా బాగా నటిస్తోంది ప్రగతి.
అయితే నటీ ప్రగతి గతంలో హీరోయిన్గా తన కెరీర్ ని మొదలుపెట్టినప్పుడు ఎందుకో స్టార్ హీరోయిన్గా సక్సెస్ కాలేకపోయింది.కాగా ఆ సమయంలో తాను ఎందుకు సక్సెస్ సంపాదించుకోలేక పోయిందో తెలియజేసింది.. ప్రగతి మాట్లాడుతూ అప్పట్లో తాను మోడలింగ్ చేస్తున్న సమయంలో హీరోయిన్గా తనకు అవకాశాలు చాలానే వచ్చాయని తెలిపింది. తమిళంలో మూడు సినిమాలకు ఒకేసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను.. కానీ ఒక హీరో తన సినిమాలో అవకాశం ఇచ్చారని తెలిపింది.
ఆ సినిమాకు అతనే నిర్మాత కావడంతో అతను తనను చాలా వేధింపులకు గురి చేశారని తన కోరిక తీర్చాలంటూ తన వెంట పడ్డారని ప్రగతి తెలియజేసింది. ఒకసారి రాత్రి తన రూమ్ కు రండి సినిమా గురించి డిస్కషన్ చేయాలని ఆ హీరో తెలిపారట.. కానీ అతను నా నుంచి ఏమి కోరుకుంటున్నాడో అనే విషయం తనకు అర్థం అయిందని అందుకే అతని రూమ్ కి వెళ్లలేదని తెలియజేసింది..
దీంతో బలవంతంగా ఆ సినిమాని కంప్లీట్ చేసి వెంటనే వివాహం చేసుకున్న చాలా చిన్న వయసులోనే వివాహం చేసుకోవడం వల్ల తన సినీ కెరియర్ కు మైనస్ గా మారిపోయింది.. కానీ ఈ మధ్యకాలంలో అవకాశాలు బాగానే వస్తున్నాయని తెలియజేస్తోంది ప్రగతి. ప్రస్తుతం ప్రగతి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి అప్పుడప్పుడు పలు రకాల జిమ్ ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూనే ఉంది ప్రగతి.