Pradeep: యాంకర్ ప్రదీప్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఈమెనా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

బుల్లితెర పై ఎంతోమంది యాంకర్స్ ఉన్నారు. కానీ తన జోక్స్ తో అందరిని ఎంతగానో నవ్వించి ఆకట్టుకునే యాంకర్ మాత్రం ప్రదీప్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈటీవీ ,మాటీవీ ,జీ తెలుగు లాంటి చానల్స్ లో యాంకర్ గా చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా ప్రదీప్ వెండితెరపై కూడా పలు పాత్రలలో నటించారు. ఇలా వెండితెర ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేసిన ప్రదీప్ 30 రోజులలో ప్రేమించటం ఎలా సినిమా తీసినా పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. మ్యూజిక్ పరంగా మంచి హిట్టు అందుకుంది.

Anchor Pradeep To Marry Politician's Daughter?

ఈ సినిమా ద్వారా అందరినీ మెప్పించినప్పటికీ తదుపరి ఎలాంటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కానీ బుల్లితెరపై చాలా కార్యక్రమాలలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఇకపోతే ప్రదీప్ ఏ ఈవెంట్ కి వెళ్లిన లేదంటే ఏ కార్యక్రమానికి వెళ్లిన ఎక్కడ చూసినా ప్రదీప్ పెళ్లి గురించే పెద్ద ఎత్తున వార్తలు ప్రస్తావనకు వస్తాయి. ప్రదీప్ కి పెళ్లి వయసు వచ్చినా కూడా ఇంకా పెళ్లి కాకపోవటంతో ఈయన పెళ్లి గురించి సోషల్ మీడియాలోవైరల్ గా మారింది.

అయితే ప్రదీప్ పెళ్లి గురించి కొన్ని వార్తలు బయట వచ్చినప్పటికీ అవి ఏమాత్రం నిజం కాదని తెలుస్తోంది. ఇకపోతే తాజాగా ప్రదీప్ పెళ్లి గురించి మరోసారి వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈసారి నిజమని ప్రదీప్ కి పెళ్లి ఫిక్స్ అయిందని పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రదీప్ కొన్ని సంవత్సరాల నుంచి ఒక ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నవ్య అనే అమ్మాయితో రిలేషన్ లో ఉన్నారని తెలుస్తోంది.

అయితే వీరిద్దరి గురించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వీరి కుటుంబ సభ్యుల ఒప్పందంతోనే వీరి పెళ్లి జరగబోతుందని ఇప్పటికే పెళ్లి గురించి చర్చలు కూడా మొదలయ్యాయని త్వరలోనే ఈ విషయం గురించి అధికారికంగా తెలియజేయబోతున్నట్లు సమాచారం. ఏదేమైనా ప్రదీప్ కి పెళ్లి జరిగితే తనకంటే తన అభిమానులు ఎంతగానో ఆనందిస్తారని చెప్పవచ్చు.

Share.