రామాయణ స్ఫూర్తితో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం లో తెరకెక్కించిన భారీ చిత్రం ఆది పురుష్. ఈ సినిమా ఈ ఏడాది జనవరి 12వ తేదీన విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత వాయిదా పడిన సంగతి అందరికీ తెలిసిందే దాదాపుగా ఆరు నెలల పాటు విడుదల తేదీకి దూరంగా జరగడం జరిగింది దీంతో ఈ ఏడాది జూన్ 16వ తేదీన విడుదల చేస్తామని డైరెక్టర్ ఓం రౌత్ చిత్ర బృందం ప్రకటించారు.
అయితే ఇందుకు కారణం ఆది పురుష్ టీజర్ ఆన్లైన్లో విడుదల చేయగా విఎఫ్ఎక్స్ తో తీవ్రమైన విమర్శలు ఎదురయ్యాయి. అంతేకాకుండా రామాయణము స్ఫూర్తితో అటు పాత్రాలను తప్పుదోవ పట్టించారనే విమర్శలు కూడా ఎక్కువగా వినిపించాయి. దీంతో ఎంతో జాగ్రత్తగా ఈ సినిమాని చేస్తూ మళ్ళీ వాయిదా వేసుకున్నారు. ఆది పురుష్ విలనిజంగా మరింత మెరుగుపరచడానికి చిత్ర బృందం చాలా కృషి చేస్తుందని డైరెక్టర్ ఓం రౌత్ తెలియజేయడం జరిగింది. ఆది పురుష్ అనేది సినిమా కాదు ప్రభు శ్రీరాముడు పై మనకున్న భక్తిని మన సంస్కృతిని చరిత్రపై ప్రజలకు ఉన్న నిబద్ధతను తెరపై ఆవిష్కరించడానికి చాలా ప్రయత్నిస్తున్నానని తెలిపారు డైరెక్టర్. ఈ చిత్రాన్ని త్రీడీలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
Vfx పనుల వల్ల ఈ సినిమా మరింత ఆలస్యం అయినట్లు తెలిపారు.భారతదేశం గర్వించదగ్గ సినిమా చేయడానికి మేమంతా కష్టపడితే ఉన్నాము మీ మద్దతు ప్రేమ దీవెన వల్లే మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయని డైరెక్టర్ తెలియజేశారు. వాస్తవానికి సంక్రాంతి బరిలో ప్రభాస్ సినిమా తప్పుకోవడంతో చిరంజీవి ,బాలకృష్ణ, విజయ్ దళపతి అజిత్ సినిమాల విడుదలయ్యాయి. ఒకవేళ ఆది పురుష్ సినిమా విడుదల అయ్యి ఉంటే ఈ సినిమాలన్నీ పోస్ట్ పోన్ అయ్యేవని సమాచారం.ఈ చిత్రంలో సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు.