అభిమానులకు సాహో షాక్…!

Google+ Pinterest LinkedIn Tumblr +

బాహుబలి తర్వాత అభిమానులకు, సిని ప్రేక్షకులకు దూరంగా ఉన్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం సాహో సినిమా షూటింగ్తో బిజిగా ఉన్నారు. బహుబలి 2 సినిమా తర్వాత ప్రభాస్ సినిమాలు లేకపోవడంతో ఆయన అభిమానులు నిరసపడి పోయారు. బహుబలి తర్వాత ఆయన నటిస్తున్న సినిమా సాహో ఎంతకు పూర్తి కాకపోవడం అభిమానులకు చిర్రెత్తుకొస్తుంది. సినిమా పూర్తి అయ్యెదెప్పుడు, తెరమీదికొచ్చెదెప్పుడు అని అభిమానులు తెగ మధనపడిపోతున్నారు.

అయితే అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ ప్రభాస్ గుడ్న్యూస్ ప్రకటించాడు. సోమవారం ఆకస్మాత్తుగా తన సోషల్ మీడియా ఆకౌంట్లైన ఇన్స్ట్రాగ్రామ్, ట్విట్టర్ వేదికగా అభిమానులకు ఓ తీపికబురు చేరవేసేందుకు మంగళవారం మూహుర్తం గా ప్రకటించాడు. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు? మీకోసం రేపు ఓ సర్ప్రైజ్ ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే నా ఇన్స్టాగ్రామ్ పేజీ చూడండి’ అంటూ ఓ వీడియోను విడుదల చేశాడు ప్రభాస్. ప్రభాస్ ఇచ్చిన ఈ సందేశం అభిమానుల్లో ఎక్కడ లేని సంతోషం వెల్లువెత్తుతుంది.

ప్రభాస్ చెప్పబోయే శుభవార్త ఏమిటోననే అతృతలో అభిమానులు ఉన్నారు. ప్రభాస్ ఇచ్చిన ఈ సందేశంతో ఎప్పడు మంగళవారం వస్తుందా ఆ శుభవార్త ఎప్పుడు వింటామా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభాస్ చెప్పబోయే శుభవార్త సాహో సినిమాకు సంబంధించినదై ఉంటుందని సిని జనాలు అనుకుంటున్నారు. ప్రభాస్ సాహో సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, సినిమా విడుదలకు సంబంధించిన విశేషాలను ఇన్స్ట్రాగ్రామ్ ద్వారా పంచుకుంటారని అందరు అనుకుంటున్నారు. సాహో సినిమాకు విడుదల తేదిని ప్రకటించే అవకాశం ఉందని, అది కాకుంటే మరో కొత్త సినిమాకు సంబంధించిన విశేషాలు ఉంటాయా లేక తన పెండ్లికి సంబంధించినదా అనేది మంగళవారం తేలనున్నది. అప్పటి దాకా మనం వేచి చూడక తప్పదు మరి.

Share.