ఆ సినిమాకు ప్రభాస్ అన్ని కోట్లు పారితోషికం తీసుకుంటున్నారట?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్, ఆ తరువాత వరుసగా పాన్ ఇండియా సినిమాలు నటిస్తూ బిజీగా ఉన్నారు. దేశ వ్యాప్తంగా కాకుండా ఏకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కు ఫాన్స్ ఉన్నారు. ఇక రోజు రోజుకి ప్రభాస్ క్రేజ్ పెరుగుతోంది. ఇక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దర్శకనిర్మాతలు ప్రభాస్ తో పాన్ ఇండియా సినిమాలతో పాటుగా పాన్ వరల్డ్ సినిమాలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్‌, ఆదిపురుష్‌, ప్రాజెక్ట్‌ K, సలార్‌, స్పిరిట్‌ చిత్రాలున్నాయి.ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలు అన్ని పాన్ ఇండియాలే లేకపోవడంతో ప్రభాస్ ఎంత రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు అనే వార్త ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ప్రభాస్ పస్తుతం ‘స్పిరిట్‌’ అనే సినిమాకు అక్షరాలా రూ.150 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట.స్పిరిట్‌ బడ్జెట్‌ రూ.300 కోట్లు అయితే అందులో సగం ప్రభాస్ కు ఇస్తున్నారట.’అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను ఎనిమిది భాషల్లో రూపొందిస్తుండగా బాలీవుడ్‌ నిర్మాత భూషణ్‌ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.మొత్తానికి మన తెలుగు హీరో తొలిసారి ఇంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్‌ తీసుకుంటుండడంతో ఈ విషయం ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. భారత్‌లో ఇంత భారీ మొత్తం పారితోషికం అందుకుంటున్న ఏకైక హీరోగా ప్రభాస్‌ రికార్డులకెక్కాడు.

Share.