యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఈ పేరుకు ప్రపంచ వ్యాప్తంగా ఓ క్రేజ్ ఉంది. బాహుబలి చిత్రంతో తన ఇమేజ్‌ను అమాంతం ఖండాంతరాలు పాకేలా చేసుకున్న ఈ హీరో, సాహో చిత్రంతో తన స్టామినాను నిరూపించుకున్నాడు. ఈ హీరో పక్కన నటించడానికి ఎందరో హీరోయిన్లు నేనంటే నేను అని క్యూ కడతారు.. ఆయనతో ఒక్కసారన్నా నటించాలని తహతహాలాడుతారు..
అయితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొందరు హీరోయిన్లతో వరుసగా సినిమాలు చేసాడు. బాలీవుడ్ బామలు కూడా ప్రభాస్‌తో నటించేందుకు ఉత్సాహం చూపుతారు.. అలాంటిది ఓహీరోయిన్ మాత్రం ప్రభాస్‌తో సినిమా చేయలేదంటే ఆశ్చర్యం కలుగకమానదు.. ప్రభాస్ తరంలో నటిస్తున్న ఈ స్టార్ హీరోయిన్ ప్రభాస్‌తో నటించేందుకు ఉత్సాహం చూపడం లేదట..
ఇంతకు ప్రభాస్‌తో నటించని హీరోయిన్ ఉందా టాలీవుడ్‌లో అనుకుంటున్నారా.. అవును మరి.. ప్రభాస్ సరసన నాలుగు సినిమాల్లో నటించిన ఘతన అనుష్క కు మాత్రమే దక్కింది. ఇక త్రిష మూడు సినిమాల్లో, తమన్నా మూడు సినిమాల్లో, కాజల్ రెండు సినిమాల్లో ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక వీరితో పాటుగా నయనతార, అసిన్, ఇలియానా, కంగనా రనౌత్ వంటి హీరోయిన్లు ప్రభాస్‌తో కలిసి నటించారు. కానీ ప్రభాస్‌తో నటించని నటి ఎవరంటే.. అందాల నటి సమంత అని చెప్పవచ్చు.. ఇప్పటి వరకు వీరు ఇద్దరు కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు.. ఇక భవిష్యత్‌లో వీరిద్దరి జోడీ కుదురుతుందో లేదో వేచి చూడాల్సిందే..