ప్రభాస్ సాహో మేకింగ్ వీడియో విడుదల

Google+ Pinterest LinkedIn Tumblr +

రెబెల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు తన తదుపరి చిత్రం ” సాహో ” మేకింగ్ వీడియో ని విడుదల చేసారు చిత్ర యూనిట్ సభ్యులు. ప్రభాస్ తన అభిమానులకి ఇచ్చిన ఈ బర్త్ డే గిఫ్ట్ వారిని మరింత ఉత్సాహపరిచింది అని చెప్పవచ్చు. ఈ వీడియో చూస్తుంటే సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే బాలీవుడ్ లో కూడా ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ సాహో సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ కి దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించిన విషయం అందరికి తెలిసిందే. అదే క్రేజ్ తో సాహో సినిమాని దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. ఇక మేకింగ్ వీడియో లోని స్టాంట్స్ చూస్తుంటే హాలీవుడ్ స్థాయిలో ఉండటం విశేషం.

Share.