రాధేశ్యామ్ ట్రైలర్ రిలీజ్.. మామూలుగా లేదుగా?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం రాధేశ్యామ్. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా జనవరి 14 సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ క్రమంలోనే ట్రైలర్ ను చూసిన ఫ్యాన్స్ అదిరిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇందులో మహా జ్ఞాని అయిన పరమహంస పాత్రలో కృష్ణంరాజు కనిపించారు. ఈ ఈవెంట్ కు దాదాపుగా 40 వేల మందికి పైగా అభిమానులు హాజరయ్యారు. అలాగే ఈ ఈవెంట్ కు జాతి రత్నం నవీన్ పొలిశెట్టి హోస్ట్ గా వ్యవహరించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లకు, పాటలకు భారీగా స్పందన లభించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేయడంతో మరింత హైప్ ను క్రియేట్ చేసింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని డార్లింగ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Share.