బాహుబలి చిత్రంతో ఇంటర్నేషనల్ స్టార్‌గా మారిన ప్రభాస్ నెక్ట్స్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ వచ్చినా పిచ్చిగా చూస్తున్నారు జనాలు. ఇటీవల ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా షేడ్స్ ఆఫ్ సాహో టీజర్ రిలీజ్ చేయగా అది భీబత్సమైన రెస్పాన్స్‌ను సాధించింది.
ఇక తన నెక్ట్స్ మూవీలను లైన్‌లో పెట్టే పనిలో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ తన 21వ చిత్రాన్ని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాకు సుకుమార్ అదిరిపోయే స్టోరీని ప్రిపేర్ చేశాడని.. అది విన్న ప్రభాస్ సుక్కును కాదనలేకపోయినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరు కలిసి ఈ సినిమాను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
అటు ప్రభాస్ తన నెక్ట్స్ మూవీని రాధాకృష్ణ దర్శకత్ంలో నటిస్తుండగా అది పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. అటు సుకుమార్ కూడా తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. మరి బాహుబలికి ఈ లెక్కల మాష్టారు ఎన్ని మార్కులు కేటాయిస్తాడో చూడాలి.