ప్రభాస్‌ ఇన్‌స్టాగ్రామ్‌ లో సమరం మొదలెట్టేశాడు!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటి వరకు ట్విట్టర్, ఫేస్ లతో కోట్ల మంది అభిమానులను సంపాదించారు. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ ఎక్కౌంట్ మరో ప్రభంజనం సృస్టించబోతున్నాడు. తెరిచిన వెంటనే తన ఖాతాలో ప్రొఫైల్‌ ఫొటో కానీ, వివరాలు కానీ పోస్ట్‌ చేయకపోవటం అభిమానులకు నిరాశకలిసిగించి. కాకపోతే అధికారికంగా ప్రకటించకపోయినా, ఆయన ఎక్కౌంట్ కు ఎనిమిది లక్షలకు చేరువలో ఫాలోవర్లు ఉండటం గమనార్హం.

కేవలం ఎక్కౌంట్ కు యాక్టర్‌ ప్రభాస్‌ అన్న పేరు మాత్రమే పెట్టుకున్నా ….ఆ ఒక్క పేరు చూసి ఇంత మంది అభిమానులు ఖాతాను అనుసరించడం మొదలుపెట్టారంటే ‘బాహుబలి’కి ఉన్న ఫాలోయింగ్‌ ఎంతో అర్థమవుతోంది. బాహుబలి సినిమాలో పిక్‌ని ఫస్ట్ పోస్ట్ చేశారు.. ఆ ఫొటోను చూసి ‘కత్తిలా ఉంది’ అంటున్నారు ఫ్యాన్స్.

ఈ ఫొటోకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఫేస్ బుక్, ట్విట్టర్ లో ప్రభాస్ అభిమానలు ఈ ఫొటోను తమ ప్రొఫైల్ గా పెట్టుకుంటున్నారు. ఏది ఏమైనా ఒక తెలుగు నటుడు జాతీయ స్థాయిలో ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించడం నిజంగా గ్రేట్ అంటున్నారు సినీ విశ్లేషకులు.

Share.