ప్ర‌భాస్ ‘ జాన్ ‘ మూవీ స్టోరీ లైన్ చెప్పేశాడుగా…

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రస్తుతం ఇండియా మొత్తం సాహో ఫీవ‌ర్‌తో ఊగిపోతోంది. సాహో సినిమా కోసం ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులంతా ఎంతో ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నారు. రూ. 350 కోట్ల భారీ బడ్జెట్తో… హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా రేపు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమా రిలీజ్ అవుతున్న ఐదు భాషల్లోనూ భారీగా ప్రమోషన్లు చేస్తున్నాడు. ప్రభాస్ మాత్రం అన్నీ తానై హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడంలో ప్రమోషన్లు చేస్తున్నాడు.

బాహుబలి సినిమాకు కూడా ప్రభాస్ ఇంత భారీగా ప్రమోషన్లు చేయలేదు. ముఖ్యంగా పాన్‌ ఇండియా సినిమా వస్తున్న‌ సాహో సినిమా మేకర్స్ పక్కా ప్లానింగ్ తో ప్రమోట్ చేస్తున్నారు. మేక‌ర్లు తొలిరోజు భారీ ఓపెనింగ్స్ పై టార్గెట్ చేశారు. తెలుగు వెర్షన్ లోనే తొలి రోజు 100 కోట్లు కొల్లగొడుతుంద‌ని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సాహో ప్రమోషన్లో భాగంగా ప్రభాస్ తన పర్సనల్ లైఫ్ కు సంబంధించి అనేక విషయాలు కూడా చెబుతున్నాడు.

తాను ఖ‌చ్చితంగా తన అభిమానుల కోసం… త‌న‌ను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని అడుగుతున్న వారి కోసం ఆయినా త్వరలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఈ క్రమంలోనే తన తర్వాత సినిమా స్టోరీ లైన్ కూడా ఎలా ఉంటుందో కూడా ప్రభాస్ చెప్పేశాడు. ప్రభాస్ నెక్స్ట్ సినిమా జిల్ ఫేం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా కథ 1950 – 60వ దశకంలో యూర‌ప్‌ నేపథ్యంలో జరిగే ప్రేమకధా చిత్రం అని చెప్పాడు. ఇంతవరకు ఇలాంటి ప్రేమ కథ తెలుగు సినిమా తెరపై చూసి ఉండరు అని కూడా చెప్పాడు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా సినిమాగా ఉంటుందని… ఇప్పటికే కొంత షూటింగ్ కూడా జరిగిందని చెప్పాడు.

Share.