రెండేళ్లుగా సాహో కోసం ఎదురుచూసిన అభిమానులకు నిరాశే మిగిలింది. సాహో ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో ? ఏ రేంజ్ లో ఉంటుందో అని ఎవరికి వారు ఎన్నో లెక్కలు వేసుకున్నారు. చివరకు సినిమా తుస్సుమంది. సినిమా రిలీజ్ అయిన వారం రోజులకే చాప చుట్టేసింది. సాహో ఒక్క హిందీలో తప్ప అన్ని భాషల్లోనూ, అన్ని ఏరియాల్లోనూ లాస్ వెంచర్ అనిపించుకుంది.
ఈ సినిమా బొక్కల లెక్కలు మామూలుగా ఉండేలా లేవు. సినిమాను బడ్జెట్ బాగా ముంచేసింది. కాస్త లోబడ్జెట్‌లో కనుక సాహోను తీసుకుని ఉంటే ఇన్ని తిప్పులు ఉండేవి కావు. బాహుబలి ధీమాతో ఎడాపెడా ఖర్చు పెట్టేయడంతో ఇప్పుడు అందరూ నిండా మునిగిపోయారు. ప్రభాస్ సైతం ఈ రేంజ్ లో షాక్ తగులుతుందని ఊహించలేదు.
ప్రస్తుతం ఇప్పుడు అందరి దృష్టి జాన్‌పై ఉంది. పి కృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. దీనికోసం దాదాపుగా రూ. 180 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారట. 1960కాలం నాటి కథతో జిల్ ఫేం రాధాకృష్ణ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. సినిమా కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కడంతో జాన్‌ను భారీ రేట్లకు కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితి.
దాదాపు 25 రకాల సెట్స్ ను నిర్మించినట్టు తెలుస్తోంది. ప్రతి సెట్ కూడా అద్భుతంగా ఉంటుందని అంటున్నారు. మరి ఈసారైనా బడ్జెట్ పైన కాకుండా కథ ఫై కాస్త దృష్టి పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా కూడా తేడా కొడితే ప్రభాస్‌తో పాటు యూవీ క్రియేషన్స్ వాళ్ల పని కూడా ఖతమైపోతుంది.