నేడు బాహుబలి సినిమాతో ప్రపంచ స్థాయిలో క్రేజ్ అందుకొని స్టార్ హీరోగా , రెబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అలాంటి ప్రభాస్ ను పట్టుకొని ఒకప్పుడు తనకు క్రేజ్ లేదని ఒక దర్శకుడు అవమానించారట. అంతేకాదు తన సినిమా నుంచి తీసేసాడు అంటూ ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయన ఎవరో కాదు ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్.. ఆయన దర్శకత్వంలో వచ్చిన మూవీ ఘర్షణ.. అప్పట్లో వెంకటేష్ హీరోగా వచ్చిన ఈ సినిమా చాలా రికార్డులను బ్రేక్ చేసింది.
ఇందులో అసిన్ హీరోగా నటించగా.. వెంకటేష్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. అయితే మొదట ఇందులో దర్శకుడు గౌతమ్ మీనన్.. హీరోగా ప్రభాస్ ను తీసుకున్నారు. కానీ ప్రభాస్ కి అప్పటికి స్టార్ హీరోగా ఇమేజ్ లేదన్న కారణంతో ఆయనను పక్కన పెట్టేసి వెంకటేష్ ను తీసుకున్నారు. కానీ ప్రభాస్ మాత్రం అసలు ఫీల్ కాలేదు.. మరో విశేషమేమిటంటే ఆ మూవీ ఆడియో లాంచ్ ప్రోగ్రామ్ కి ప్రభాస్ గెస్ట్ గా వెళ్లి అందరికీ విషెస్ కూడా చెప్పాడు.. అది ప్రభాస్ మంచితనం అంటే..
ప్రభాస్ ఎంత ఎత్తుకు ఎదిగినా సరే ఒదిగి ఉంటాడే తప్ప గర్వం చూపించడం అనడానికి ఇదే చక్కటి నిదర్శనం. ముఖ్యంగా ఆయనకు ఈ ఒక్క కారణమే కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసింది. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్న ప్రభాస్ ఇప్పుడు ఏకంగా 6 సినిమా ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు. మరి ముందుగా ఏ సినిమాలో రిలీజ్ చేస్తారో చూడాలి. ఇప్పటికే ఆది పురుష్, సలార్ , ప్రాజెక్టు కే వంటి సినిమా షూటింగ్లు పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఏ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.