ప్రభాస్-హృతిక్ కాంబో మూవీకి.. హీరోల రెమ్యూనరేషన్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో పాన్ ఇండియా హీరోగా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న హీరోలలో ప్రభాస్ కూడా ఒకరు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి పటాన్ సినిమా డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్ తో మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారనే న్యూస్ చూశాక ఇండియా వైడ్ ప్రేక్షకులు తెగ ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. ఇప్పటికే మైత్రి బ్యానర్ లో సిద్ధార్థ ,ప్రభాస్ కాంబో చిత్రం ఓకే అయ్యింది. ఈ చిత్రం కోసం హృతిక్ రోషన్ నెగటివ్ రోల్ లో నటించబోతున్నాడు.

Prabhas to join hands with Hrithik Roshan for director Om Raut's next? |  Telugu Movie News - Times of India

ఇక ప్రభాస్ పాన్ ఇండియా హీరో హృతిక్ రోషన్ వీరిద్దరి కాంబినేషన్లో అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు.అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని రూ.750 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించటమే కాదు..ప్రభాస్ ఈ చిత్రానికి రూ. 100 కోట్ల పారతోషకం అందుకోబోతున్నాడట. ఈ సినిమాలో హృతిక్ రోషన్ విలన్ పాత్రకి రూ.75 కోట్లు పారతోషకం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో నటించటానికి బాలీవుడ్ టాప్ హీరోయిన్ ని సెలెక్ట్ చేయాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మైత్రి వారు సిద్ధార్థ్ ఆనంద్ పఠాన్ సక్సెస్ కి విష్ చేసి వచ్చారు.

పఠాన్ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ సినిమాగా వచ్చి భారీ విజయం సాధించటంతో పాటు వందల కోట్లను వసూళ్లతో దూసుకెళ్తోంది. కొద్ది రోజులుగా వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న బాలీవుడ్ పరిశ్రమకు పఠాన్ విజయం కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సినిమా దర్శకుడు సిద్ధార్థ ఆనంద్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇలాంటి టైంలో ప్రభాస్ , హృతిక్ రోషన్ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే చెప్పనవసరమే లేదు మామూలుగా ఉండదు. ఇక మూవీ 2024లో రిలీజ్ కి సిద్ధమవుతుందని టాక్ వినిపిస్తోంది.

Share.