ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్ పెద్దమ్మ..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లి అనే పదం ఈమధ్య ఎక్కువగా వినిపిస్తోంది. పెళ్లి చేసుకుంటే ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు తగ్గిపోతాయి అనుకొనేవారు చాలామంది ఉన్నారు.. కానీ ఇప్పుడు సినిమాలు సినిమాలే పెళ్లి పెళ్లిలే అంటున్నారు.కానీ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం ఇంతవరకు ఆ టాపిక్ ఏమీ మాట్లాడలేదు. అయితే ఈ విషయంపై ప్రభాస్ అభిమానులు చాలా డిసప్పాయింట్ అవుతున్నారు.

Prabhas Trends on X: "Happy birthday Shyamala devi Garu  https://t.co/IDFei7hFb1" / X
సినిమాలతో అందరినీ అలరించినప్పటికీ పెళ్లి కూడా చేసుకోవాలని ఇప్పటికే ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనను ఎన్నోసార్లు డిమాండ్ చేశారు.అంతేకాదు ఎక్కడ కనిపించినా కూడా పెళ్లెప్పుడు చేసుకుంటారు. ఇంకెప్పుడు మీ పెళ్లి అంటూ చాలామంది ప్రభాస్ ని అనేక రకాలుగా ప్రశ్నిస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా కృష్ణంరాజు భార్య శ్యామల దేవి ప్రభాస్ పెళ్లి పై ఒక గుడ్ న్యూస్ చెప్పింది.

అదేంటంటే ఇన్నాళ్లు మా ఫ్యామిలీని ఆదరించినందుకు మీకు ధన్యవాదాలు నా భర్త లేకపోయినా ప్రభాస్ ని అలాగే మా ఫ్యామిలీని చాలా బాగా ఆదరించారు. అలాగే తను దేవి నవరాత్రులు కోసం విజయవాడలో ఉన్న దుర్గమ్మను దర్శనానికి వెళ్ళింది. అక్కడ మీడియా ఆమెను చుట్టుముట్టి పలు ప్రశ్నలను వేసింది. ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో అంటూ రకరకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆమె దానికి సమాధానాలు ఇస్తూ త్వరలోనే ప్రభాస్ కి పెళ్లి చేస్తాము నెక్స్ట్ దసరా కల్లా ప్రభాస్ పెళ్లి గురించి క్లారిటీ ఇస్తాను అయితే ఆ అమ్మాయి ఎవరు అనేది మాత్రం ఇప్పుడే చెప్పను.

అయితే ప్రభాస్ పెళ్లిని నా భర్త ఉన్నప్పుడే జరిపించాలని అనుకున్నాము కానీ ప్రభాస్ షూటింగ్ బిజీలో ఉండటం వల్ల కాస్త లేట్ అయింది. అప్పుడే అయ్యి ఉంటే వారి పెదనాన్న ఉండేవారు అంటూ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి వెల్లడించారు.అభిమానులు ప్రభాస్ పెళ్లి అనగానే గెంతులేస్తున్నారు. ప్రభాస్ పెళ్లి చేసుకునేది అనుష్కని అంటూ ఇంకాస్త సంబర పడుతున్నారు.

Share.