ప్రస్తుతం ప్రభాస్ మొత్తం అన్నీ కూడా పాన్ ఇండియా లెవల్లో తన చిత్రాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ కొన్ని వందల కోట్ల సినిమాలను తెరకెక్కించడం జరుగుతోంది. ఒకవైపు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సలార్, అలాగే డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ -k, మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైనట్లు వార్తలు కూడా వినిపించాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదంతా ఇలా ఉండగా హర్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఒక రాజ్ మహాల్ సెట్ నీ కూడా వేయబోతున్నట్లు సమాచారం. ఇదంతా ఇలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక న్యూస్ తెలుగు సినీ ఇండస్ట్రీలో వైరల్ గా మారుతోంది .ప్రస్తుతం ప్రభాస్ ఒక్కో చిత్రానికి దాదాపుగా రూ.150 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ప్రాజెక్ట్-k కోసం హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి మిగిలిన సినిమాకి రూ .100 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది
.
అయితే ఊహించని విధంగా మారుతి సినిమా కోసం ప్రభాస్ ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా విడుదల తర్వాత పట్టి ఈ సినిమా సక్సెస్ ని బట్టి అందులో షేర్ ని రెమ్యూనరేషన్ గా ఇవ్వమని నిర్మాతలకు చెప్పినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నిర్మాత మిగిలిన క్యాస్టింగ్ రెమ్యూనరేషన్ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ తో కలుపుకొని వందల కోట్ల రూపాయలతో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంటే రూ.300 కోట్ల రూపాయలకు పైగా షేర్ రాబట్టే అవకాశం ఉంటుంది. మరి ఈ సినిమా సక్సెస్ అందుకొని ప్రభాస్ మారుతికి ఏ మేరకు లాభాలను అందిస్తాయో చూడాలి మరి.