తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రభాస్, అనుష్క జోడి కి ఒక ప్రత్యేకమైన పాపులారిటీ ఉన్నది. వీరి కాంబినేషన్లో వచ్చిన మిర్చి, బిల్లా, బాహుబలి వంటి చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు సునామీని సృష్టించాయి. ఈ చిత్రాలను వీరి కెమిస్ట్రీ కూడా అదుర్స్ అనిపించేలా చేసింది. ఆఫ్ స్క్రీన్ లో కూడా వీరిద్దరి కెమిస్ట్రీ చూసి బయట నిజంగానే వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని వార్తలు చాలా వైరల్ గా మారాయి. ముఖ్యంగా నాలుగుపదుల వయసు దాటినప్పటికీ ఈ జంట వివాహం చేసుకోకపోవడంతో చాలా రకాలుగా వార్తలు వినిపిస్తూ ఉంటాయి.
అయితే వీరిద్దరూ మాత్రం కొన్ని సందర్భాలలో మా ఇద్దరి మధ్య ఎలాంటిది ఏమీ లేదని కేవలం స్నేహితులం అని చెబుతూ ఉంటారు.అయితే వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని వార్తలకు పుల్ స్టాప్ పడలేదని చెప్పవచ్చు. ఇక అన్ స్టాపబుల్ టాక్ షోలో తాజాగా ప్రభాస్ పాల్గొన్న సంగతి తెలిసిందే .మొదటి భాగం న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేశారు. ఇక రెండవ భాగాన్ని తాజాగా నిన్నటి రోజున విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇందులో బాలయ్య ప్రభాస్ గోపీచంద్రులకు ఎన్నో ప్రశ్నలు అడగడం జరిగింది.
నయనతార, తమన్నాను చూపిస్తూ ఎవరితో షాపింగ్ వెళతావు అనే ప్రశ్న అని ప్రభాస్ అడగగా ఇద్దరితో అని చెప్పారు. ఆ తర్వాత శ్రద్ధ కపూర్, పూజా హెగ్డే ఫోటోలు చూసి వీళ్లలో ఎవరితో సినిమాకి వెళ్తావు అని అడగగా ఇద్దరిని తీసుకెళ్లానని సరదాగా చెప్పారు. ఆ తరువాత కృతి సనన్, అనుష్క ఫోటోలు చూపించి ఇద్దరితో ఎన్నో రూమర్స్ వస్తున్నాయి ఒకవేళ వీళ్ళతో డేటింగ్ లో ఉన్నట్లు రూమర్ వస్తే ఎవరితో నిజమని నమ్ముతావని బాలకృష్ణ ప్రభాస్ ని అడగగా. ప్రభాస్ మాత్రం చాలా తెలివిగా ఎవరిని నమ్మరంటూ జవాబు ఇచ్చారు. కానీ ఆడియన్స్ మాత్రం ప్రభాస్ అనుష్క డేటింగ్ లో ఉన్నారని విషయాన్ని నిజమని నమ్ముతున్నారు.