టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు ప్రభాస్. వరుసగా పాన్ ఇండియా చిత్రాలలోనే నటిస్తూ స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్నారు. ప్రభాస్ రెమ్యూనరేషన్ కూడా కొన్ని కోట్ల రూపాయలు అందుకుంటున్నారు. ఆది పురుష్ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా ప్రభాస్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది .అదేమిటంటే ప్రభాస్ ఆరోగ్యం పైన పలు రకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా బాలీవుడ్ మీడియా నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రభాస్ ఆరోగ్యం సరిగ్గా లేదని వార్తలు వినిపిస్తున్నాయి. అనారోగ్య సమస్య కారణంగా వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్న ప్రభాస్ ఆరోగ్యం మళ్లీ క్షీణించిందని తెలియజేస్తున్నాయి. దీంతో ప్రభాస్ షూటింగులు కూడా బ్రేక్ పడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి ఆయనకు ఆరోగ్యం బాగాలేదని ఈ కారణంగానే ఒక ప్రైవేటు ఆసుపత్రిలో జాయిన్ అయినట్లుగా కూడా సమాచారం.
మెరుగైన వైద్యం కోసం విదేశాలకు వెళ్ళబోతున్నట్లుగా బాలీవుడ్ మీడియాలో కథలుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని ప్రభాస్ సన్నిహితులు కూడా చెబుతున్నట్లు సమాచారం. ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ విషయాన్ని అసలు నమ్మడం లేదు. ఎందుకంటే ప్రభాస్ విషయంపై ఏ చిన్న విషయాన్ని అయినా సరే టాలీవుడ్ మీడియా రియాక్ట్ అవుతుంది. కానీ ఈ విషయంపై మీ ఎవరు రియాక్ట్ కాకపోవడంతో కేవలం ఇది బాలీవుడ్ మీడియా పడుతున్న కుట్ర అని తెలియజేస్తున్నారు. మరి ఈ విషయంపై ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.