అమిర్ ఖాన్ ని ఫాలో అవుతున్న పవర్ స్టార్

Google+ Pinterest LinkedIn Tumblr +

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో బిజీ గా ఉన్నారు. తీవ్ర కంటి సమస్యతో బాధపడుతున్న కూడా ఏ పీ లో అయన పర్యటన కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ కి మరో సారి కంటి ఆపరేషన్ జరిగింది. ఈ సారి వైద్యులు ఆయనకి కొద్దీ రోజులు విశ్రాంతి కావాలని సలహా ఇచ్చారు. అయితే ప్రస్తుతం పవన్ కూడా వైద్యులు చెప్పిన విధంగా తన పర్యటనని ప్రస్తుతం నిలిపి వేసి విశ్రాంతి తీసుకుంటున్నారు.

అయితే కొన్ని రోజులుగా ఒక వార్త ఇండస్ట్రీ లో చెక్కర్లు కొడుతుంది. అదే పవర్ స్టార్ మరి కొన్ని రోజుల్లో బుల్లి తెర పై దర్శనమివ్వనున్నారట, గతంలో బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించిన ‘ సత్యమేవ జయతే ‘ షో ని తెలుగు లో పవన్ కళ్యాణ్ ఇక్కడ నిర్వహించనున్నారని సమాచారం. ఈ షో కూడా జన సేన తాజాగా టేక్ ఓవర్ చేసిన మీడియా ఛానల్ లో ప్రసారం అవుతుందని తెలుస్తుంది. ఈ షో కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సామాన్య ప్రజలని, వారి సమస్యలని ప్రస్తావించనున్నారు. ఇదే కనుక నిజమైతే పవర్ స్టార్ పార్టీ కి మరింత మైలేజ్ రావటం ఖాయం.

Share.