సైరా టీజర్ పై పవర్ స్టార్ స్పందన

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు సినిమా ప్రేక్షకులు ఎంత గానో ఎదురు చూసిన సైరా నరసింహ రెడ్డి టీజర్ నిన్న విడుదల చేసారు చిత్ర యూనిట్ సభ్యులు. చిరంజీవి గారి అమ్మ అంజనా దేవి గారు ఈ టీజర్ ని విడుదల చేయటం విశేషం. ఇక విడుదలైన తొలి రోజే సుమారు 6 .9 మిలియన్ యూ ట్యూబ్ వ్యూస్ టోటల్ గా 11 మిలియన్ డిజిటల్ వ్యూస్ ని దక్కించుకుంది ఈ సినిమా టీజర్.

నిన్న రాత్రి శిల్ప కల వేదిక లో జరిగిన చిరు బర్త్ డే ఈవెంట్ లో రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు అరవింద్ మరియు వరుణ్ తేజ్ పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ ఈ సినిమా టీజర్ ని దర్శకుడు నాకు ఉదయం 10 45 నిమిషాలకి తనకి పంపారని, నేను వెంటనే కళ్యాణ్ బాబాయ్ కి టీజర్ ని వాట్స్ అప్ ద్వారా పంపానని తెలిపారు. కళ్యాణ్ బాబాయ్ సైరా టీజర్ చూసిన వెంటనే నాకు ఫోన్ చేసి టీజర్ బాగా వచ్చిందని, సినిమా ఎప్పుడు చూద్దామా అని ఉందని బాబాయ్ అన్నారు అని చరణ్ ఈ వేదిక పై చెప్పి అభిమానులని ఉత్సాహ పరిచారు.

చరణ్ మాట్లాడుతూ ఇది ఊరికే ఫ్యాన్స్ ని ఖుషి చేయటానికి చెప్పినది కాదని కళ్యాణ్ బాబాయ్ నిజంగానే టీజర్ చూసిన మొదటి వ్యక్తని చరణ్ అభిమానులతో అన్నారు. చరణ్ ఈ విషయం చెప్పిన వెంటనే హాల్ అంత ఒక్క నిమిషం అభిమానుల ఈలలు, కేకలతో దద్దరిల్లి పోయింది. ఈ సినిమాని వచ్చే సంవత్సరం సమ్మర్ లో విడుదల చేయటానికి ప్రయత్నిస్తున్నామని చరణ్ తెలిపారు.

Share.