Posani..బాలకృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇక బాలయ్య అప్పుడప్పుడు కోప్పడుతూ ఉంటారని కోపిష్టి అనే వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి.. ఇప్పుడు తాజాగా నటుడు కమెడియన్ పోసాని(Posani )కృష్ణ మురళి బాలయ్య పైన పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని పట్టుకొని సైకో అంటున్నారు ఎవరు సైకోను ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలంటు పోసాని ఎద్దేవా చేశారు.. రీసెంట్గా హైదరాబాదులో ఒక కార్యక్రమం సంబంధించి మీడియాతో మాట్లాడిన పోసాని బాలయ్య పైన మండిపడ్డారు.. ఈ సందర్భంగా ఆయన నంది అవార్డుల గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఈ క్రమంలోనే పోసాని మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని బాలయ్య సైకో అని అంటున్నారు.. బాలకృష్ణ గారు ఇద్దరినీ తుపాకీతో టపిమని కాల్చేశాడు మంచి వాళ్ళు ఎవరైనా అలా కాలుస్తారా ఇప్పుడు చెప్పండి సైకో ఎవరు కాల్చినాక కూడా ఆయన జైలుకు వెళ్లకుండా బయటే తిరుగుతున్నారు..
అదే పని నేను చేస్తే నన్ను వదిలేస్తారా తీసుకువెళ్లి జైల్లో పెడతారు.. కోర్టుకు పంపించి శిక్ష వేస్తారు కానీ బాలకృష్ణకు అవేవి వర్తించలేదు..ఆయనకు ఏదైనా సమస్య ఉంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి కేసులు పెట్టుకోవచ్చు గన్ను ఉంది కదా అని ఇద్దరిని కాల్చేస్తే ఎలా అంటూ తెలిపారు.. ఇక అంతటితో వదిలేయకుండా స్టార్ నటుడు మరొకసారి మీ ఇంట్లో మీ కళ్ళముందే నైట్ వాచ్మెన్ చనిపోయాడు శవం అక్కడ ఉండగానే మీరు మేకప్ వేసుకొని షూటింగ్ కి వెళ్ళిపోయారు.. ఈ విషయంలో ఎవరైనా బాలయ్యను ప్రశ్నించారు.. ఎవరు ఇలాంటి పనులు చేస్తారో తెలిసింది..ఎవరు సైకో మరి మా జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో ఏ ఒక్క పని చేశారు అంటూ ఫైర్ అయ్యారు.
అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు అరే అని ఒక్క మాట కూడా ఎవరిని పిలవలేదు అసలు నేను వినలేదు మరి ఎవరు సైకో అంటూ పోసాని రెచ్చిపోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పోసాని వెంట ఆలీతోపాటు జోగి నాయుడు కూడా పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.