బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ విషయం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ తర్వాత రాజ్కుంద్రా బెయిల్ కోసం 2, 3 సార్లు అప్లై చేయగా రిజెక్ట్ చేసిన కోర్టు చివరికి అతనికి బెయిల్ ను మంజూరు చేసింది. అశ్లీల చిత్రాల కేసులో సుప్రీంకోర్టు రాజ్ కుంద్రా కు కాస్త ఊరట లభించింది. అంతేకాకుండా సుప్రీంకోర్టు రాజకీయాలకు అరెస్టు కాకుండా నాలుగు వారాలు బెయిల్ను మంజూరు చేసింది . ఈ క్రమంలోనే న్యాయస్థానం మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది.
గత నెల నవంబర్ 25న బాంబే హైకోర్టు ముందస్తు బెయిల్ కోసం రాజ్ కుంద్రా దాఖలు చేసిన పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే రాజ్ కుంద్రా వీడియోలు శృంగార భరితమైనవే అయినప్పటికీ, ఆ వీడియోలో శారీరక, లైంగిక కార్యకలాపాలను చూపించలేదని హైకోర్టు పిటిషన్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా తాను అటువంటి వీడియోలు తయారీలో లేదా ప్రచారంలో పాల్గొన లేదని చెప్పడమే కాకుండా అతను ఈ కేసులో తప్పుగా ఇరికించారని అన్నారు. అయినా కూడా బెయిల్ ను హైకోర్టు నిరాకరించడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు.