పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన పూనమ్

Google+ Pinterest LinkedIn Tumblr +

నటి పూనమ్ పాండే సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటుంది. గతంలో ఆమె తెలుగులో ‘మిస్ మాలిని & కొ’  సినిమాలో నటించింది, అటు తర్వాత తెలుగులో ఆమె నటించలేదు. పూర్తిగా బాలీవుడ్ చిత్రాలకే ఆమె పరిమితం అయిపోయారు. ఆమె సినిమాల్లో అంతగా నటించకపోయిన హాట్ ఫోటో షూట్లతో ప్రేక్షకులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటారు. ఇక పూనమ్ చాల సంవత్సరాల తరువాత  తెలుగులో ” లేడీ గబ్బర్ సింగ్ ” అనే సినిమాలో నటిస్తున్నారు.

నిన్న పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఆమె ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి విషెస్ చెబుతూ ” పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు, అయన నాకు నిజమైన ఇన్స్పిరేషన్, నా తదుపరి చిత్రం ‘ లేడీ గబ్బర్ సింగ్ ‘ చిత్రంలో అయన చేసిన దాంట్లో ఒక 1 % చేసిన చాలు, అయన అభిమాని గా చాల సంతోషిస్తా ” అని ట్వీట్ చేసింది. ఆమె పవన్ కళ్యాణ్ మీద ఎంతో గౌరవం తో చేసిన ఈ ట్వీట్ పవర్ ఫ్యాన్స్ కి నచ్చటంతో వారు ఆమె సినిమాకి అల్ ది బెస్ట్ చెప్పారు.

 

Share.