పవన్ కళ్యాణ్, పూనం కౌర్ మధ్య ఏం జరిగింది అన్నది అందరికి తెలిసిందే. అయితే ఈ విషయంపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుకుంటారు. ఛాన్స్ దొరికితే పవన్ మీద ఎటాక్ చేయాలని చూస్తుంది పూనం కౌర్. కత్తి మహేష్ తర్వాత పవన్ మీద గురి పెట్టిన పూనం ఈమధ్య కొన్నాళ్లు సైలెంట్ గా ఉంది. అయితే లేటెస్ట్ గా మళ్లీ పూనం కౌర్ ఓ ట్వీట్ డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ గా పవన్ ను ఉద్దేశించి చేసినట్టు అనిపిస్తుంది.
ఇంతకీ పూనం కౌర్ ఏమని ట్వీట్ చేసింది అంటే ఓ అబద్ధాలకోరు రాజకీయ నాయకుడు కాగలడు కాని లీడర్ కాలేడని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ఎవరి గురించి చేసింది అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పూనం కౌర్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ మీద హాట్ హాట్ కామెంట్స్ చేస్తూనే ఉంటుంది. కాని పవన్ వాటికి స్పందించడం మాత్రం జరుగదు.
ఆమె ఎప్పుడు పెట్టినా ఇన్ డైరెక్ట్ గా పెడుతుంది.. అయితే పూనం పెట్టే మెసేజులు పవన్ ను గురించే అని అందరికి తెలుసు. మరి పవన్ పై పూనం మరోసారి ఫైర్ అవడానికి గల కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది. హీరోయిన్ గా మంచి ఫ్యూచర్ ఉంటుందని అనుకున్న పూనం కౌర్ హీరోయిన్ గా సక్సెస్ అవకపోగా పవన్ విషయంలో ఎప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తుంది.