ఆంధ్ర, తెలంగాణ ప్రజల పై నటి పూనమ్ కౌర్ షాకింగ్ కామెంట్స్

Google+ Pinterest LinkedIn Tumblr +

నటి పూనమ్ కౌర్ లాల్ ప్రస్తుతం అంతగా సినిమా అవకాశాలు లేకపోయినా ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. తన అఫీషియల్ ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటారు నటి పూనమ్ కౌర్. ఇక తాజాగా పూనమ్ ట్విట్టర్ లో ఆంధ్ర, తెలంగాణ ప్రజల పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ” ఆంధ్ర, తెలంగాణ ఇలా మన వాళ్ళే కొట్టుకుంటుంటే, రొట్టె ఎవరికీ దక్కుతుంది. నాకైతే ఏమి అర్ధం కావటం లేదు..నా చిన్న నాటి స్కూల్ స్టోరీ ఒకటి గుర్తుకు వస్తుంది ఈ పరిస్థితి చూస్తుంటే అని రెండు పిల్లులు కొట్టుకుంటుంటే ఒక కోతి వచ్చి రొట్టెని ఎత్తుకెళ్లిపోయే ఫోటోని షేర్ చేసారు పూనమ్.

ఆమె ఈ వ్యాఖ్యలు చేయటానికి గల ప్రధాన కారణం ఏమిటో దాని వెనుక ఆంతర్యం ఏమిటో ఆమెకే తెలియాలి. ప్రస్తుతం పూనమ్ కౌర్ తెలుగులో సైరా నరసింహ రెడ్డి చిత్రంలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. నితిన్ నటించిన శ్రీనివాస కళ్యాణం సినిమాలో కూడా పూనమ్ ఒక ముఖ్య భూమిక పోషించిన సంగతి తెలిసిందే. సినిమాల్లోనే కాకుండా ఆమె ప్రస్తుతం ” స్వర్ణ ఖడ్గం ” అనే ఒక తెలుగు సీరియల్ లో కూడా నటిస్తున్నారు.

Share.