పూజా హెగ్డే మొదటి సంపాదన ఎంతో తెలుసా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

మొదటిసారి నాగచైతన్య హీరోగా ఒక లైలా కోసం అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పూజాహెగ్డే , తమిళ్ లో జీవ సరసన మాస్క్ సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమా టైటానిక్ సినిమా కథనే బ్రేక్ చేసిందంటూ ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లు, పోస్టర్లు చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ సినిమా కనుక సక్సెస్ అయితే పూజా హెగ్డే రేంజ్ హాలీవుడ్ రేంజ్ ను అందుకుంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

ఇకపోతే తాజాగా పూజా హెగ్డే తొలి సంపాదన ఎంత అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలుపుతూ ఇలా వివరించింది.ఈమె చిన్నప్పుడే కొరియోగ్రఫీ నేర్చుకుందట. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆమె తాతగారు క్రీడా సంస్థ కోసం సర్టిఫికెట్లను కూడా రాయించేవారు అట. అలా రాయించుకున్న తర్వాత 300 రూపాయలు ఇచ్చేవారట. పూజ హెగ్డే తొలి సంపాదన ఇదే కావడం గమనార్హం. ఇక టీనేజర్ గా మొదటిసారి మోడలింగ్ చేసి 5 వేల రూపాయలను చెక్కులు అందుకున్నదట ఈ ముద్దుగుమ్మ..

Share.