టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న వారిలో పూజా హెగ్డే కూడా ఒకరు. ఎంతమంది స్టార్ హీరోలతో నటించి పలు అవకాశాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం చాలా డేంజర్ జోన్లో ఉందని చెప్పవచ్చు. ఈమె నటించిన సినిమాలన్నీ వరుసగా లాఫలవుతున్న సమయంలో అవకాశాలు వస్తున్నప్పటికీ సక్సెస్ మాత్రం రాలేకపోతున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో SSMB -28 చిత్రంలో మాత్రమే నటిస్తోంది ఈమె ఆశలన్నీ కూడా ఈ చిత్రం పైనే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
పూజా హెగ్డే నటించిన సినిమాలన్నీ గత ఏడాది చాలా ఫ్లాప్ గా నిలిచాయి. ఇక ఏడాది చివర్లో బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సర్కస్ సినిమాలో నటించగా అది కూడా పరాజయాన్ని చవి చూసింది. పూజ హెగ్డే ప్రస్తుతం హిందీలో సల్మాన్ ఖాన్ తో ఒక చిత్రంలో మాత్రమే నటిస్తోంది.ఈ సినిమాలో ఆమె పాత్ర ఎంత ఉంటుంది ఎలా ఉంటుంది అనే విషయం ఇంకా సందేహం గానే ఉంది. ఇక తెలుగులో మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా షూటింగ్లో త్వరలోనే పాల్గొనబోతోంది.
గతంలో కూడా అలా వైకుంఠపురం సినిమాతో మళ్ళీ తన క్రేజీను అందించిన త్రివిక్రమ్ ఇప్పుడు మరొకసారి పూజా హెగ్డే తనని నమ్ముతోందని వార్తలు వినిపిస్తున్నాయి. షూటింగ్లకు కావలసిన డేట్లు ఇవ్వడంతో ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో కూడా ఎక్కువ రోజులు మీడియాలో ఉండాలని పూజ హెగ్డే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మహేష్ బాబుతో చేయబోతున్న ఈ సినిమాకు పూజా హెగ్డే కు చివరి అవకాశం అన్నట్లుగా పలువురు నెట్టిజన్లు తెలియజేస్తున్నారు. మరి ఈ సినిమాతో సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.