టాలీవుడ్ లో కి ముకుంద సినిమాతో ప్రేక్షకులకు పరిచయమయ్యింది హీరోయిన్ పూజా హెగ్డే. ఆ సినిమా ఒక మోస్తరుగా ఆడింది. ఆ తరువాత స్టార్ హీరోల సినిమాలలో నటించి నేర్పించండి. అలా పూజా హెగ్డే కెరియర్లో ఎన్నో చిత్రాలలో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది.ఈమధ్య పూజా హెగ్డే పరిస్థితి దారుణంగా తయారయింది. దానికి కారణం ఆమె ప్రవర్తనే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి దర్శక నిర్మాతలు ఈమెకు అవకాశాలు ఇవ్వటానికి భయపడుతున్నారట.
ఎందుకంటే గత ఏడాది నుంచి వరుసగా ఫ్లాపులు చవిచూస్తున్న పూజ హెగ్డే కు ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది.. దీంతో పూజా హెగ్డే ఏ సినిమాలో అడుగుపెట్టిన ఆ సినిమా ఫ్లాప్ అయ్యేలా కనిపిస్తున్నాయి. అందుకనే ఈమెకి దర్శక, నిర్మాతలు సినిమా అవకాశాలు ఇవ్వటానికి భయపడుతున్నారనే టాక్ వినిపిస్తోంది..
అయితే ఈ మధ్యనే మహేష్ బాబు తో గుంటూరు కారం సినిమాలో హీరోయిన్గా ఫిక్స్ అయిందని వార్తలు వినిపించాయి.. అందులో శ్రీ లీల, పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. అయితే ఈ మూవీలో త్రివిక్రమ్ పూజా హెగ్డే కంటే శ్రీ లీలకే ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తున్నాడని కథ పరంగా కంటెంట్ పరంగా శ్రీ లీలాకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వటంతో పూజ కోపంతో సినిమా నుంచి పక్కకు తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేసిందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇప్పుడు ఈ వార్త తెగ వైరల్ గా మారుతోంది.ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పూజా హెగ్డే పై ఫైర్ అవుతున్నారు. ఈమధ్య నీకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి ఇప్పుడు అవకాశం ఎందుకు వదులుకుంటున్నావు అంటూ ఆమెపై మండిపడుతున్నారు. మహేష్ బాబు లాంటి అగ్ర హీరోతో బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకుంటావు అని కామెంట్లు చేస్తున్నారు.
పూజ హెగ్డే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు యాక్టివ్ గా కనిపిస్తూ ప్రేక్షకులతో ముచ్చటిస్తూ ఉంటుంది. మరి ఈ విషయం పైన పూజ హెగ్డే ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.