టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస సినిమా ఆఫర్లను అందుకుంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా చక్రం తిప్పుతోంది. ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే, మరొక వైపు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటుంది. అయితే పూజా హెగ్డే ఏం చేసినా కూడా సో క్యూట్, వావ్ అంటూ నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉంటారు .కానీ తాజాగా మాత్రం నెటిజన్లు ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలే ఎక్కువగా సోషల్ మీడియాలో వాణిజ్య ప్రకటనలను ప్రమోట్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఒక విస్కీ బ్రాండ్ కు ప్రచారం చేసింది. ఒక గౌను ధరించి, ఒక గ్లాసులో విస్కీ పోసి అందులో ఐస్ క్యూబ్స్, సోడా కలిపి ఆహా అనేలా మిక్సింగ్ చేస్తోంది.ఈ క్రమంలోనే తన్మయత్వంతో డాన్స్ చేస్తుంది.
ఇదంతా కూడా ఒక వీడియో తీసి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు డబ్బు కోసం మద్యం సేవించాలని ప్రోత్సహిస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు వీళ్లకు డబ్బు సంపాదనే ధ్యేయం.. నైతిక విలువలు ఏ మాత్రం పట్టించుకోరు..అంటూ సోషల్ మీడియాలో పూజా హెగ్డే పై ఫైర్ అవుతున్నారు. గతంలో కాజల్ అగర్వాల్ కూడా ఇదే విధంగా ఆల్కహాల్ ని ప్రమోట్ చేస్తూ విమర్శలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే.