ఇన్నాళ్లకు నా కల నెరవేరింది: పూజా హెగ్డే?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు పూజా హెగ్డే. వరుస సినిమాల్లో నటిస్తూ, వరుస హిట్లు అందుకుంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ చక్రం తిప్పుతూ ఉంది. ఇటీవలే పూజా హెగ్డే నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మంచి సూపర్ హిట్ ను అందుకుంది. అలాగే ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటించండి. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో లక్కీ హీరోయిన్ అనే పేరు తెచ్చుకొని డైరెక్టర్స్,ప్రొడ్యూసర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది ఈ బుట్ట బొమ్మ.

వరుస సినిమాల్లో నటిస్తూ ఉన్న ఈ ముద్దుగుమ్మ కాస్త విరామం దొరకడంతో ఇటీవలే మాల్దీవుల టూర్ ను ఎంజాయ్ చేసి వచ్చింది. ఈ క్రమంలోనే ఆమె పాల్గొంటున్న సెట్స్ లో ఫోటోలు షేర్ చేసింది. ఇందులో ఆమె తో కలిపి లెజండ్రీ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నారు.

అతనితో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసింది పూజా హెగ్డే. ఫోటోని షేర్ చేస్తూ లెజెండ్ అమితాబ్ గారితో కలిసి వర్క్ చేయాలి, షూటింగ్ లో పాల్గొనాలి అనేది నాకు ఎప్పటినుంచో ఉన్న కల. ఆ కల ఇన్నాళ్లకు నెరవేరింది.. చాలా ఎక్కువ చెప్పేసాను మరింత తెలుసుకోవడానికి వేచి ఉండండి అని పోస్ట్ చేసింది. అయితే పూజా హెగ్డే,అమితాబ్ బచ్చన్ సినిమాకోసం కలిసారా, లేక ఏదైనా యాడ్ షూటింగ్ కోసమా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.

Share.