తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్లలో పూజా హెగ్డే కూడా ఒకరు ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటినుంచే.. ఈ ముద్దుగుమ్మ అదే ఫిట్నెస్ తో అదే అందంతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటోంది. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నది ఈ ముద్దుగుమ్మ. ఈ ఏడాది మాత్రం పూజ హెగ్డేకు అంతగా కలిసి రాలేదని చెప్పవచ్చు. తను నటించిన ఆచార్య ,బీస్ట్ , రాధే శ్యామ్ సినిమాలు బారి డిజాస్టర్ ను చవి చూశాయి.
దీంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అవకాశాలు చాలా తగ్గిపోయాయి అని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అయితే పూజా హెగ్డే కు సినిమా అవకాశాలు తగ్గడానికి పలు కారణాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణ హీరోయిన్గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె వరుసగా అవకాశాలు అందుకోవడమే కాకుండా పాన్ ఇండియన్ హీరోయిన్ గా కూడా గుర్తింపు సంపాదించింది. ఈ క్రమంలోనే తన రెమ్యూనరేషన్ పెంచిందని టాక్ బాగా వైరల్ గా మారింది. ఇదంతా ఇలా ఉంటే తాజాగా ఈ విషయంపై పూజ హెగ్డే స్పందిస్తూ తన రెమ్యూనరేషన్ పై నిర్మాతలను ఇబ్బంది పెటింది అసలు లేదని తెలియజేస్తోంది.
కేవలం ఇలాంటి వార్తలన్నీ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ రూమర్లే అని తెలియజేస్తోంది .తాను ప్రస్తుతం బిజీగా లేనని మంచి సినిమా కథల కోసం చూస్తున్నానని తెలియజేస్తోంది .తనకు నచ్చిన కథ దొరికితే రెమ్యూనరేషన్ను తగ్గించి మరి నటిస్తానని తెలియజేస్తోంది. సినిమాలో పాత్ర కథ ఎలా ఉందో ముందు చూస్తానని ఆ తర్వాతే రెమ్యూనరేషన్ గురించి ఆలోచిస్తానని తెలియజేసింది. క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. క్యాస్టింగ్ కౌచ్ తనకి ఎప్పుడూ ఎదురు అవ్వలేదని కానీ కొంతమంది చెబితే విన్నానని తెలియజేస్తోంది.