టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన పూజా హెగ్డే ప్రస్తుతం పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈమె కెరీయర్ని టర్నింగ్ పాయింట్ చేసిన సినిమా ఏదైనా ఉందంటే దువ్వాడ జగన్నాథం సినిమా అని చెప్పవచ్చు. ఇక తర్వాత వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సక్సెస్ సాధించుకుంది. దీంతో స్టార్ హీరోయిన్ల చేరిపోవడమే కాకుండా రెమ్యూనరేషన్ పరంగా భారీగా డిమాండ్ చేస్తోంది.
ఇక తన వ్యక్తిగత సంబంధిత విషయానికి వస్తే.. పూజా హెగ్డే వ్యక్తిగత సంబంధిత విషయాలలో కూడా తన ఖర్చులలో నిర్మాతలకు భారం వేస్తోందని వార్తలు వినిపించాయి. ముఖ్యంగా కోలీవుడ్లో నిర్మాతలు సంఘమే అమ్మడు తీరుపై భగ్గుమంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పూజా హెగ్డే మరీ అంత సక్సెస్ లో లేదు… కానీ చేతిలో పలు అవకాశాలైతే ఉన్నాయి. వాటిని వినియోగించుకోవడంలో కాస్త తడపడుతోందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయినా సరే ఈమె తగ్గేదే లేదు అన్నట్లుగా రెమ్యూనరేషన్ విషయంలో డిమాండ్ చేస్తూ ఉందని సమాచారం.
తాజాగా వీటిపై పూజ హెగ్డే స్పందిస్తూ పారితోషకం కోసం నిర్మాతలని తాను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదని నేను రెమ్యూనరేషన్ కూడా పెంచలేదని అవన్నీ మీడియాలో వస్తున్న ఒట్టి పుకార్లే అని తెలియజేస్తోంది. కేవలం డబ్బు కోసమే పని చేయాలి అంటే ఇప్పటికీ ఎన్నో సినిమాలకు అడ్వాన్సులు తీసుకొని బిజీగా ఉండాలి కానీ నేను ఇప్పుడు అంత బిజీగా లేను మంచి కథల కోసమే ఎదురుచూస్తున్నాను.. అలాంటి కథలు నా ముందుకు వస్తే డబ్బు విషయమే ఒక సమస్య కాదని తెలియజేస్తోంది. ఒక సినిమా సంతకం చేసిన తర్వాత ఆ సినిమా అయిపోయే వరకు పని చేస్తాను అది నా స్వభావం అంటూ తెలియజేస్తోంది పూజా హెగ్డే.