ఇప్పటివరకు పూజా హెగ్డే ,మహేష్ బాబుతో కలిసి మహర్షి సినిమాలో నటించింది. ఇప్పుడు మరొకసారి మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో కూడా ఈమె నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఒక షెడ్యూల్ ని పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా మ్యూజిక్ సెట్టింగ్ దుబాయిలో జరుగుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాలో పూజా హెగ్డే అసలు పాల్గొనలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె కారణంగానే సెకండ్ షెడ్యూల్ కాస్త ఆలస్యమైంది అని వార్తలు కూడా బాగా వైరల్ గా మారాయి.
మొదట ప్రాజెక్టు ఒప్పుకున్న పూజా హెగ్డే ఇప్పుడు డేట్స్ అడ్జస్ట్ కాలేకపోవడంతో తన నెక్స్ట్ షెడ్యూల్ మొదలు కాలేదని వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ వార్తలకు పుల్ స్టాప్ పెడుతూ పూజా హెగ్డే ఇప్పుడు షూటింగ్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నానంటూ తెలియజేస్తోంది. ఇక వచ్చేవారం నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలు కాబోతోందని పూజా హెగ్డే డిసెంబర్ 15 నుంచి సినిమా షూటింగుల పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఈమె డేట్లు కూడా ఆల్రెడీ నిర్మాతలకు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది.
ముంబైలో ప్రస్తుతం సర్కస్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న పూజ హెగ్డే హైదరాబాద్ కు త్వరలోనే రానుంది. మహేష్, త్రివిక్రమ్ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రానికి సంగీతాన్ని తమన్ అందిస్తున్నారు. ఇందులో పూజ హెగ్డే హీరోయిన్గా ఉండడంతో పాటు మరొక హీరోయిన్ కూడా ఉండబోతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ఇదివరకే ప్రకటించారు. ఇక పూజ హెగ్డే పై వస్తున్న రూమర్లకు ఈ విధంగా పెట్టిందని ఆమె అభిమానులు భావిస్తున్నారు.
ప్రస్తుతం పూజ హెగ్డే ఒకవైపు తెలుగులో మరొకవైపు బాలీవుడ్ లో నటిస్తూ చాలా బిజీగా ఉంటోంది. అంతేకాకుండా పూజ హెగ్డే ఈ మధ్యకాలంలో వరుసగా ప్లాపులను చవిచూస్తోంది. మరి పూజ హెగ్డే కెరీర్ కు ఏ చిత్రం ప్లస్ అవుతుందో చూడాలి మరి. పారితోషకం విషయంలో కూడా పూజ హెగ్డే ఏమాత్రం వేనకడుగు వేయలేదని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం పూజా హెగ్డే కు సంబంధించి ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.