టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పాపులారిటీ సంపాదించుకొని బాలీవుడ్ కి షిఫ్ట్ అయిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు.. అలాంటి వారిలో హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఒకరు.. ఈమె ప్రస్తుతం ముంబై సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది.ఇటీవల బాలీవుడ్ పై పూర్తిగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. తాజాగా పూజా హెగ్డే ఈ దసరాకి అదిరిపోయే సెల్ఫ్ గిఫ్ట్ ఇచ్చుకుంది. ఇటీవల సిల్వర్ రేంజ్రేంజ్ రోవర్ ఎస్‌యువిని కొనుగోలు చేసింది. దీని విలువ సుమారు రూ.4 కోట్లు ఉంటుందని సమాచారం.
మీడియా కథనాల ప్రకారం.. ఈ కారు హై ఎండ్ లో లుక్ ఎంతో అద్భుతమైన లుక్ ఉంది. వాహన వేగ పరిమితి 234 కి.మి-లీటర్ 6-సిలిండర్ ఇంజెనియం పెట్రోల్ ఇంజన్‌తో డిజైన్ చేసినది. ఇందులో 294 kW మోటార్‌తో కలిపి 404.5 kW శక్తిని అందిస్తుంది. ఈ వాహనం 13.1-అంగుళాల ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సౌకర్యవంతమైన హెడ్-అప్ డిస్‌ప్లే, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఫోర్-స్పోక్ స్టీరింగ్ వీల్ .. ఎంటర్ టైనింగ్ బ్యాక్ సీటు స్క్రీన్ వంటి ఆకట్టుకునే ఫీచర్లతో వస్తుంది. రేంజ్ రోవర్ ఇప్పుడు లాంగ్ వీల్‌బేస్ వెర్షన్‌తో ప్రత్యేకంగా అందుబాటులో ఉండే మూడవ-వరుస సీటును కలిగి ఉంది. ‘అయితే ఇది పెట్రోల్ వర్షన్ లేక డీజల్ వర్షన్ అన్న విషయం ఇంకా తెలియటం లేదు.
ఇక ఈమె కారు సిల్వర్ రంగులో ఉంది. అంతే కాకుండా రకరకాల రంగుల్లో కూడా అందుబాటులో ఉంది. ఈ కారు ఈ అద్భుతమైన రేంజ్ రోవర్ ఎస్ యు వి తన గ్యారేజీలో రాజును తలపించేలా అనిపిస్తోంది. ఇప్పటికే పూజా హెగ్డే గ్యారేజీలో పలు ఖరీదైన కార్లు ఉన్నాయి అందులో ఇది చాలా ఖరీదైనది సందర్భాన్ని బట్టి పూజ తన ప్రయాణానికి కారులను ఎంపిక చేస్తుంది. ఇక కెరీర్ మ్యాటర్ కి వస్తే పూజ ఇటీవల తెలుగు ఇండస్ట్రీ కంటే బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఎక్కువగా సినిమాలను చేస్తోంది.