బుట్ట‌బొమ్మ‌తో క‌లిసి వెంక‌టేష్ సినిమా

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ స్టార్ విక్టరీ వెంకటేష్ త్వరలో బాలీవుడ్ సినిమాలో బుట్టబొమ్మ పూజ హెగ్డేతో కలిసి నటించనున్నారు. అది కూడా బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరో గా నటించనున్న చిత్రంలో. ఇంతకి ఈ ముగ్గురు కలిసి నటించే సినిమా ఏంటి అనుకుంటున్నారా.. అదేనండి ఫర్హాద్ సామ్ జీ డైరెక్ట్ చూస్తూ, సాజిద్ నడియడ్ వాలా నిర్మిస్తున్న చిత్రం భాయ్ జాన్. ఇటీవల హైదరాబాద్లో జరిగిన అంతిమ ప్రెస్ మీట్లో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ తాను వెంకటేష్ తో కలిసి సినిమా చేయబోతున్నారని అన్నారు. అదే బాలీవుడ్ చిత్రం భాయిజాన్.

అయితే వెంకటేష్ ఇది వరకు కూడా తకదీర్ వాలా సినిమా సహా రెండు, మూడు చిత్రాల్లోనూ నటించారు. ఆ తర్వాత తెలుగు చిత్రాలకే పరిమితమైన వెంకటేష్ ఇప్పుడు మళ్ళీ బాలీవుడ్ చిత్రంలో నటించబోతున్నారు. పెరుగుతున్న సినిమా మార్కెట్ , మారుతున్న ట్రెండ్ ను అనుసరించి విక్టరీ వెంకటేష్ సల్మాన్ ఖాన్ తో నటించేందుకు ఓకే అన్నారు. సల్మాన్ ఖాన్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ నటించడం విశేషమనే చెప్పుకోవాలి.

ఓ వైపు నెట్ ఫ్లిక్స్ వారు రూపొందిస్తున్న వెబ్ సిరీస్ లోనూ రానా దగ్గపాటి తో కలిసి వెంకటేష్ నటిస్తున్నారు. మరో వైపు బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ తో కలిసి నటిస్తున్నారు. ఇప్పటికే దబాంగ్ చిత్రం దక్షిణాదిన డబ్ చేసి విడుదల చేసిన సల్మాన్ ఖాన్, రాబోయే చిత్రాలు కూడా దక్షిణాది భాషల్లో డబ్ చేసి విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇక బట్ల బొమ్మ పూజ హెగ్డే విషయానికొస్తే ఆమెకున్న క్రేజ్ అంత ఇంత కాదు. ఆమె చేస్తున్న ప్రాజెక్ట్స్ చూస్తే ఔరా అనిపించక మానదు. పెద్ద స్టార్ల సరసన, భారీ ప్రాజెక్టుల్లో నటిస్తున్న ఆమె స్పీడ్ చూస్తే నోరెళ్ళ బెట్టక మానరు. అయితే ఈ ముగ్గురి కాంబినేషన్ ఎలా ఉండబోతోందో వేచి చూడాలి మరి.

Share.