అధిక వడ్డీలు ఇప్పిస్తానని చెప్పి వందల కోట్ల రూపాయలను కాజేసి మోసం చేసిన వ్యాపారవేత్త శిల్పా చౌదరి వ్యవహారం బయటపడడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. దాదాపుగా 100 నుంచి 200 కోట్ల రూపాయలు మోసం చేసింది అన్న ఆరోపణలు వచ్చాయి. ఈమె సినీ సెలబ్రిటీ లతో పాటు నగరానికి చెందిన పలువురిని మోసం చేసిందట. దీంతో వెంటనే రంగంలోకి దిగిన నార్సింగ్ పోలీసులు శిల్పా చౌదరి ని, ఆమె భర్తను తాజాగా అరెస్టు చేశారు.
అంతేకాకుండా శిల్పా చేతిలో మోసపోయిన వారిలో టాలీవుడ్ కి చెందిన ముగ్గురు హీరోలు కూడా ఉండటం గమనార్హం. ఈమె ఫేజ్ త్రీ పార్టీలతో సెలబ్రెటీలను ఆకర్షిస్తూ మోసపూరితంగా డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో పలువురు సెలబ్రిటీలు ప్రముఖులు తాను మోసపోయామని పోలీస్ స్టేషన్ చుట్టూ క్యూ కట్టడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు శిల్పా ఆమె భర్తపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేవలం హీరోలు మాత్రమే కాకుండా వ్యాపారవేత్తలు, లాయర్లు, ఫైనాన్సర్ లు కూడా ఉన్నారని తెలుస్తోంది.