మొదటిసారి ఆర్ఎక్స్ 100 సినిమాతో కుర్రకారులను సైతం తన వైపు తిప్పుకొనే లా చేసింది అందాల ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్. ఈ ఒక్క సినిమాతోనే మంచి క్రేజీ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో నెగటివ్ సేడ్స్ లో ఉన్న క్యారెక్టర్ నటించినప్పటికీ తన గ్లామర్ తో అందంతో మెస్మరైజ్ చేసిందని చెప్పవచ్చు. ఇక సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తరచూ ఆక్టివ్ గా ఉంటూ బోల్డ్ వీడియోలను ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. నిత్యం ఏదో ఒక ఫోటోలతో ట్రెండింగ్లో నిలుస్తూనే ఉంటుంది.
తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. పాయల్ రాజ్ పుత్ గడిచిన కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే.. సౌరభ్ దింగ్రా అనే వ్యక్తిని ప్రేమిస్తున్నది.ఇతను కూడా మోడల్ , నిర్మాత కూడా.. పాయల్ బుల్లితెర పైన నటిస్తున్న సమయంలో ఈయనతో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.తాజాగా సౌరవ్ పుట్టినరోజు సందర్భంగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా పాయల్ కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన కొన్ని హాట్ ఫోటోలను సైతం షేర్ చేయడంతో ఈ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.
ఇక ఈ ఫోటోలతోపాటు ఒక ఎమోషనల్ నోట్ ను కూడా రాసుకొచ్చింది. గత కొన్నేళ్లుగా నీ జీవితంలో కఠినమైనవని తెలుసు జీవితం అంటే అంతే కానీ నువ్వు అంతకన్నా టఫ్ నీకు భగవంతుడు సమస్యలు ఎదుర్కొని శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు నా సంతోషానికి నువ్వు అందమైన జీవితానికి నీవే కారణం అంటూ రాసుకుంది పాయల్ ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారుతోంది.
View this post on Instagram